కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన సన్‌రైజర్స్ సారథి డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీనిపై విమర్శలు వచ్చాయి. అయితే తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు వార్నర్. తమ బౌలింగ్ విభాగం బలంగా ఉందని.. కోల్‌కతాను తక్కువ పరుగులకు కట్టిడి చేయాలనుకున్నట్లు వెల్లడించాడు.
"నేను ఆ నిర్ణయం సరైందే అనుకుంటున్నా. మా బలం బౌలింగ్. ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం కష్టం అనుకున్నాం. నేను నా నిర్ణయానికి కట్టుబడి ఉంటా. ప్యాట్ కమిన్స్ టెస్టు మ్యాచ్ మాదిరి లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేశాడు. మిడిలార్డర్ ఇంకా మెరుగవ్వాలి. ప్రారంభంలో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. నాలుగు, ఐదు ఓవర్ల వరకు 20 పరుగులే ఇచ్చాం. కానీ కేవలం మూడు వికెట్లే తీయడం కొంచెం బాధగా ఉంది. మరో 30,40 పరుగులు చేస్తే బాగుండేది."
- వార్నర్, సన్‌రైజర్స్ సారథి
ఈ మ్యాచ్‌లో కోల్‌కతా సన్‌రైజర్స్ మొదట బ్యాటింగ్ చేసి 142 పరుగులు చేసింది. వార్నర్ 36 పరుగులతో మంచి ప్రారంభం ఇవ్వగా.. మనీశ్ పాండే (51) అర్ధసెంచరీతో రాణించాడు. తర్వాత 143 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది కోల్‌కతా. శుభమన్ గిల్(70 ) అర్థశతకంతో అదరగొట్టి కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.