ETV Bharat / sports

ఆర్సీబీXహైదరాబాద్: ప్లేఆఫ్స్ రేసులో నిలిచేదెవరు? - IPL LIVE

షార్జా వేదికగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్-సన్​రైజర్స్ హైదరాబాద్​ మధ్య నేడు (శనివారం) మ్యాచ్​ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇందులో గెలుపు ఇరుజట్లకూ చాలా ముఖ్యం.

IPL 2020, RCB VS SRH Match Preview: Royal Challengers Bangalore vs Sunrisers Hyderabad
హైదరాబాద్-బెంగళూరు మ్యాచ్
author img

By

Published : Oct 31, 2020, 9:05 AM IST

సన్​రైజర్స్ హైదరాబాద్​ రసవత్తర పోరుకు సిద్ధమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో శనివారం హోరాహోరీగా తలపడనుంది. ఫ్లేఆఫ్స్​కు అర్హత సాధించాలంటే వార్నర్​ సేనకు ఈ మ్యాచ్​ ఎంతో ముఖ్యం. మరి ఏం చేస్తుందో చూడాలి. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.

హైదరాబాద్ గెలవాల్సిందే

దిల్లీపై గెలిచి జోష్​ మీదున్న హైదరాబాద్​.. ప్లేఆఫ్స్​లో చోటే లక్ష్యంగా ఆడుతోంది. గత మ్యాచ్​లో అదరగొట్టిన వార్నర్(66), సాహా(87)తో పాటు మిడిలార్డర్​లో మనీశ్ పాండే రాణిస్తున్నాడు. బౌలింగ్​లోనూ స్పిన్నర్ రషీద్ ఖాన్, సందీప్ శర్మ, నటరాజన్ ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నారు. ఇదే జోరు కొనసాగితే బెంగళూరుకు కష్టమే!

hyderabad
హైదరాబాద్ బ్యాట్స్​మెన్

ప్రస్తుతం 12 మ్యాచ్​లాడి 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్న హైదరాబాద్.. మిగిలిన రెండు మ్యాచ్​ల్లోనూ కచ్చితంగా గెలవాలి. అప్పుడే ప్లేఆఫ్స్ రేసులో నిలుస్తుంది. దీంతో ఇతర మ్యాచ్​ల ఫలితాలపై సన్​రైజర్స్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

బెంగళూరు ఏం చేస్తుందో?

గత రెండు మ్యాచుల్లో ఓడిన ఆర్సీబీ.. హైదరాబాద్​పై కచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఒకవేళ ఇందులో గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్​కు అర్హత సాధిస్తుంది. యువ ఆటగాడు దేవ్​దత్ పడిక్కల్, కోహ్లీ, డివిలియర్స్ ఫుల్​ఫామ్​లో ఉన్నారు. ఇతర బ్యాట్స్​మెన్ ఫిలిప్, గుర్​కీరత్ సింగ్, శివమ్ దూబే, మోరిస్.. వీరికి సహకారమందించాల్సిన అవసరముంది. బౌలింగ్​ విభాగంలోనూ బలపడాల్సి ఉంది. మరి రషీద్​ ఖాన్ స్పిన్​ను బెంగళూరు బ్యాట్స్​మెన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

RCB CRICKETERS
బెంగళూరు క్రికెటర్లు

జట్లు(అంచనా)

హైదరాబాద్: డేవిడ్​ వార్నర్​ (కెప్టెన్​), వృద్ధిమాన్ సాహా, విలియమ్సన్​, మనీశ్​ పాండే, ప్రియమ్​ గార్గ్​, విజయ్ శంకర్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, ఖలీల్​ అహ్మద్​, సందీప్​ శర్మ, నటరాజన్​

బెంగళూరు: దేవదత్ పడిక్కల్, జోష్ ఫిలిప్, కోహ్లీ (కెప్టెన్), డివిలియర్స్, గురుకీరత్, శివం దూబే, మోరిస్, సుందర్, ఉదానా, సిరాజ్, చాహల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.