ETV Bharat / sports

సీఎస్కే ఈ మార్పు చేస్తే మంచిది! - csk success track ipl 2020

ఈ ఐపీఎల్​లో చెన్నై జట్టు గెలుపు బాట పట్టాలంటే సామ్​ కరన్​​ను ఓపెనర్​గా పంపడమే సరైన పరిష్కారమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తద్వారా సీఎస్కే తర్వాతి మ్యాచుల్లో విజయం సాధించే అవకాశం ఉందని అంటున్నారు.

IPL
సీఎస్కే
author img

By

Published : Oct 4, 2020, 9:32 PM IST

ఈ ఏడాది ఐపీఎల్.. చెన్నై సూపర్ కింగ్స్​కు కలిసి రావడం లేదనే చెప్పాలి. ఈ మెగాలీగ్​ కోసం యూఏఈ చేరుకున్న నాటి నుంచి చెన్నైని దురదృష్టం వెంటాడుతోంది. తన తొలి మ్యాచ్​ను ఘనంగా విజయంతో ప్రారంభించినా.. అనంతరం ఆడిన మూడు మ్యాచుల్లో వరుసగా పరాజయం పొందింది. ఓడినా మూడు మ్యాచుల్లో సారథి ధోనీ.. పలు మార్పులు చేసినా ఫలితం దక్కలేకపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది.

దీంతో సీఎస్కే ఇకనైనా తన తర్వాతి మ్యాచుల్లో గెలవాలంటే ఒకే ఒక్క దారి ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సామ్​ కరన్​​ను ఓపెనర్​గా లేదా టాప్​ ఆర్డర్​లో బ్యాటింగ్​కు పంపితే మంచిదని సూచిస్తున్నారు. తద్వారా సీఎస్కే విజయం సాధించే అవకాశాలున్నాయని అంటున్నారు.

"సామ్ కరన్ ఎటువంటి బౌలింగ్​నైనా సమర్థంగా ఎదుర్కోగలడు. భారీ షాట్లు కొట్టగలడు. ముఖ్యంగా తడబడకుండా ఆడే సామర్థ్యం ఉంది. కాబట్టి అతడిని టాప్​ ఆర్డర్​లో బ్యాటింగ్​కు పంపితే మ్యాచ్​ ఆదిలోనే జట్టు భారీ స్కోరు సాధించగల్గుతుంది. దీంతోపాటు జట్టులో ఉన్న కొన్ని సమస్యలు కూడా వాటంతట అవే సద్దుమణుగుతాయి."

-క్రీడా విశ్లేషకులు.

దక్షిణాఫ్రికా క్రికెటర్​ డుప్లెసిస్​కు బదులుగా సామ్​ కరన్​​ను ఓపెనర్​గా దింపడం వల్ల వాట్సన్​పై ఒత్తిడి తగ్గుతుందన్నారు క్రీడా విశ్లేషకులు. నాలుగో స్థానంలో ఆడుతోన్న కేదర్​ జాదవ్​ను లోయర్​ ఆర్డర్​లో పంపాలని సూచించారు. తద్వారా జట్టు క్లిష్టపరిస్థతుల్లో ఉన్నప్పుడు అతడు ఆదుకుంటాడని అన్నారు. కాగా, నెం.6, 7 స్థానాల్లో ధోనీ బ్యాటింగ్​కు దిగాలా లేదా అనేది అతడి నిర్ణయమని తెలిపారు. అతడో గొప్ప సారథని.. ఏ స్థానంలో దిగినా గొప్పగా రాణిస్తాడని చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి రైనా రికార్డును సమం చేసిన రోహి
త్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.