వరుస ఓటములతో ఢీలాపడి, టోర్నీ నుంచి దాదాపుగా తప్పుకున్న చెన్నై సూపర్‌కింగ్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో నేడు తలపడనుంది. ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో ఘోరంగా ఆడుతున్న ధోనీసేన.. 11 మ్యాచ్‌ల్లో ఎనిమిదింట్లో ఓడి, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనైనా గెలుస్తుందా? లేదా? అనేది చూడాలి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభంకానుంది.
కుర్రాళ్లకు అవకాశం
సీనియర్ల నిలకడలేని ప్రదర్శనలతో మ్యాచ్‌లు ఓడిపోతున్నప్పటికీ ధోనీ తీరు మార్చుకోవట్లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ముంబయితో మ్యాచ్‌కు యువ ఆటగాళ్లు రుతురాజ్, జగదీషన్లకు అవకాశమిచ్చాడు. కానీ ఖాతా తెరవకుండానే వారు ఔటయ్యారు. అయినా సరే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ కుర్రాళ్లకు అవకాశాలు ఇస్తామని ధోనీ చెప్పాడు.
కరన్ ఒక్కడే
ఈ సీజన్లో చెన్నైకి ఏదైనా మంచి జరిగింది అంటే అది సామ్ కరన్ ఒక్కడే. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న ఇతడు.. రానున్న మ్యాచ్‌లు, వచ్చే సీజన్లో చెన్నైకి కీలకం అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఎలా ఆడుతాడో చూడాలి. కరన్‌తో పాటే ఇతర సీఎస్కే ఆటగాళ్లు కూడా రాణించాల్సిన అవసరముంది. అప్పుడే కాస్త పరువైనా నిలుపుకొంటుందీ జట్టు.
దూకుడుగా బెంగళూరు
14 పాయింట్లతో ముంబయితో సమంగా ఉన్న బెంగళూరు.. పాయింట్ల పట్టికలో మాత్రం మూడో స్థానంలో ఉంది. సీజన్‌లోని మిగతా మ్యాచ్‌ల్లో బాగా ఆడి రన్‌రేట్ పెంచుకోవాలని భావిస్తోంది. జట్టులోని బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు పటిష్ఠంగానే కనబడుతున్నాయి. గత మ్యాచ్‌తో సిరాజ్ అదిరిపోయే ఫామ్‌లోకి రావడం జట్టు సభ్యుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
గ్రీన్ జెర్సీల్లో ఆర్సీబీ
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలనే ఆలోచనలో భాగంగా చెన్నైతో మ్యాచ్‌లో పచ్చ రంగు జెర్సీలను ధరించి బరిలోకి దిగనున్నారు బెంగళూరు ప్లేయర్లు. ఈ మేరకు ట్విట్టర్లో వీడియోను పోస్టు చేశారు.
ఈ సీజన్‌లోని తమ తొలి మ్యాచ్‌ను ఇరుజట్లు.. ఇదే మైదానంలో ఆడాయి. ఆరోజు చెన్నైపై 37 పరుగుల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. అది కూడా కోహ్లీసేనకు కలిసొచ్చే అంశం. ఇన్ని సానుకూల విషయాల మధ్య ఈ మ్యాచ్ ఏకపక్షంగా సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు!
-
Bold Diaries: RCB Go Green Initiative
— Royal Challengers Bangalore (@RCBTweets) October 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
RCB players will sport the Green Jerseys against CSK tomorrow to spread awareness about keeping the planet clean and healthy.#PlayBold #IPL2020 #WeAreChallengers #Dream11IPL pic.twitter.com/jW6rUqWW62
">Bold Diaries: RCB Go Green Initiative
— Royal Challengers Bangalore (@RCBTweets) October 24, 2020
RCB players will sport the Green Jerseys against CSK tomorrow to spread awareness about keeping the planet clean and healthy.#PlayBold #IPL2020 #WeAreChallengers #Dream11IPL pic.twitter.com/jW6rUqWW62Bold Diaries: RCB Go Green Initiative
— Royal Challengers Bangalore (@RCBTweets) October 24, 2020
RCB players will sport the Green Jerseys against CSK tomorrow to spread awareness about keeping the planet clean and healthy.#PlayBold #IPL2020 #WeAreChallengers #Dream11IPL pic.twitter.com/jW6rUqWW62
జట్లు(అంచనా)
చెన్నై: సామ్ కరన్, డుప్లెసిస్, రాయుడు, జగదీషన్, ధోనీ (కెప్టెన్), రుతురాజ్, జడేజా, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, హెజిల్వుడ్, తాహిర్
బెంగళూరు: దేవదత్, ఫించ్, కోహ్లీ (కెప్టెన్), డివిలియర్స్ , గుర్కీరత్, సుందర్, మోరిస్, ఉదానా, సిరాజ్, సైనీ, చాహల్