ETV Bharat / sports

చెన్నైపై దిల్లీ ఘన విజయం- రాణించిన శ్రేయస్‌ టీమ్‌ - csk-delhi match news

చెన్నై సూపర్ సింగ్​పై దిల్లీ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ధోనిసేన 131 చేసింది. దిల్లీ బౌలర్లలో రబాడ 3, నోర్జే 2 వికెట్లు తీయగా, అక్షర్‌ పటేల్‌ 1 వికెట్‌ తీసి దిల్లీకి ఘన విజయాన్ని అందించారు.

IPL-2020 live score csk vs dc match
చెన్నైపై దిల్లీ ఘన విజయం- సమష్టిగా రాణించిన శ్రేయస్‌ టీమ్‌
author img

By

Published : Sep 25, 2020, 11:46 PM IST

ధోనీసేన వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. దుబాయి వేదికగా దిల్లీతో తలపడిన తన మూడో టీ20లో 44 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 176 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 131 పరుగులే చేసింది. డుప్లెసిస్‌(43; 35 బంతుల్లో 4x4), కేదార్‌ జాధవ్‌(26; 21 బంతుల్లో 3x4) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. ఆదిలోనే మురళీ విజయ్‌(10), షేన్‌వాట్సన్‌(14) విఫలమయ్యారు. ఆపై డుప్లెసిస్‌, జాధవ్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేసినా వారు వికెట్‌ కాపాడుకోడానికే ప్రధాన్యత ఇచ్చారు. దీంతో ధోనీ(15) క్రీజులోకి వచ్చేసరికి లక్ష్యం కొండంతగా ఉంది. ఈ నేపథ్యంలో చెన్నై ఏ దశలోనూ లక్ష్యాన్ని చేరుకునేలా కనిపించలేదు. దిల్లీ బౌలర్లలో రబాడ 3, నోర్జే 2 వికెట్లు తీయగా, అక్షర్‌ పటేల్‌ 1 వికెట్‌ తీశాడు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 175 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా (64; 43 బంతుల్లో 9x4, 1x6), శిఖర్‌ ధావన్‌(35; 27 బంతుల్లో 3x4, 1x6) శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 10.4 ఓవర్లలో 94 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే చావ్లా బౌలింగ్‌లో తొలుత ధావన్‌ ఎల్బీగా వెనుతిరగ్గా.. స్వల్ప వ్యవధిలోనే పృథ్వీషా సైతం అతడి బౌలింగ్‌లోనే స్టంప్‌ ఔటయ్యాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన రిషభ్‌ పంత్‌(37; 25 బంతుల్లో 6x4), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(26; 22 బంతుల్లో 1x4) తమ వంతు బ్యాటింగ్‌ చేయడంతో చెన్నై ముందు మంచి టార్గెట్‌ నిర్దేశించింది. ఈ ఇన్నింగ్స్‌లో చావ్లా రెండు వికెట్లు, సామ్‌కరన్‌ ఒక వికెట్‌ తీశాడు.

ఇదీ చూడండి: ధోనీ సేనపై దిల్లీ అద్భుత విజయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.