ETV Bharat / sports

సింపుల్​గా గెలిచేస్తాం అనుకున్నా: రాహుల్​

author img

By

Published : Sep 28, 2020, 12:32 PM IST

ఐపీఎల్​ ప్రస్తుత సీజన్​లో కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ నిర్దేశించిన అత్యధిక పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్​ రాయల్స్ జట్టు అవలీలగా ఛేదించింది. ఈ మ్యాచ్​లో రాజస్థాన్​ బ్యాట్స్​మెన్​ శాంసన్​,​ తెవాతియా రాణించడం వల్లే తమ జట్టుకు పరాజయం ఎదురైందని అన్నాడు పంజాబ్​ జట్టు కెప్టెన్​ కేఎల్​ రాహుల్​. ఈ మ్యాచ్​లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని భవిష్యత్​లో మరింత మెరుగవుతామని తెలిపాడు.

IPL 2020: KL Rahul reacts after heartbreaking loss to Rajasthan Royals
సింపుల్​గా గెలిచేస్తాం అనుకున్నా: కేఎల్​ రాహుల్​

'విజయం మా చేతుల్లోనే ఉంది' అనే నమ్మకంతో ఉన్న మ్యాచ్​లో అనూహ్యంగా పరాజయం ఎదురైందని అంటున్నాడు కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ కెప్టెన్​ కేఎల్​ రాహుల్​. ఆదివారం జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్​ బ్యాట్స్​మెన్ తమ బౌలర్లపై ఒత్తిడి తీసుకురావడంలో విజయం సాధించారని తెలిపాడు. రాజస్థాన్​ గెలుపొందడంలో సంజూ శాంసన్​, రాహుల్​ తెవాతియా కీలకపాత్ర పోషించారని వెల్లడించాడు.

"టీ20 క్రికెట్​ను మేం చాలా ఏళ్లుగా గమనిస్తున్నాం. రాజస్థాన్​పై మ్యాచ్​లో చాలా బాగా రాణించాం. కానీ, కొన్ని విషయాల్లో కలిసి రాలేదు. కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతాయి. నిజం చెప్పాలంటే గెలుపు మదే అనే నమ్మకంతో ఉన్నాం. కానీ, చివరికి ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​ దాటికి మా బౌలర్లు ఒత్తిడికి లోనయ్యారు. గత రెండు మ్యాచ్​ల్లో మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. లీగ్​ ప్రారంభంలోనే పరాజయం రావడం మంచిదే. దీని వల్ల ఎంతో నేర్చుకుని మరింత బలంగా రాణిస్తాం. సంజూ శాంసన్​, రాహుల్​ తెవాతియా అద్భుత బ్యాటింగ్​ ప్రదర్శన చేశారు. వారు ఈ విజయానికి అర్హులు."

- కేఎల్​ రాహుల్​, కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ కెప్టెన్​

పంజాబ్‌ నిర్దేశించిన 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్‌ 6 వికెట్లు కోల్పోయి మూడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. దీంతో టోర్నీ చరిత్రలోనే ఈ జట్టు అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సరికొత్త రికార్డు నెలకొల్పింది.

తొలుత బ్యాటింగ్​కు దిగిన కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ జట్టు 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 223 పరుగులు సాధించింది. ఛేదనలో రాజస్థాన్​ రాయల్స్​ జట్టు నిర్ణీత ఓవర్లలో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ప్రారంభంలో బట్లర్‌(4) విఫలమైనా సంజూ శాంసన్‌(85; 42 బంతుల్లో 4x4, 7x6), స్టీవ్‌స్మిత్‌(50; 27 బంతుల్లో 7x4, 2x6) చెలరేగి ఆడారు. వీరిద్దరూ పంజాబ్‌ బౌలర్లపై ఎదురుదాడి చేసి ఓవర్‌కు పది పరుగుల చొప్పున రాబట్టారు. రాహుల్‌ తెవాతియా(53; 31 బంతుల్లో 7x6) తొలుత పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. తాను ఎదుర్కొన్న తొలి 19 బంతుల్లో 8 పరుగులే చేశాడు. ఇక పరిస్థితి చేయి దాటిపోతున్న వేళ సంజూ విజృంభించి ఆడాడు. సంజూ శాంసన్​, రాహుల్​ తెవాతియా అద్భుత బ్యాటింగ్​ ప్రదర్శనతో రాజస్థాన్​ జట్టును విజయం వరించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.