ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ పదమూడో సీజన్ వ్యాఖ్యాతల బృందంలో ఒకడైన కెవిన్ పీటర్సన్ శుక్రవారం తిరిగి లండన్ చేరుకున్నాడు. పిల్లలతో కలిసి సమయం గడపడం కోసమే అతను అర్ధంతరంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. కరోనా పరిస్థితుల కారణంగా యూకేలో విద్యాసంస్థల సెలవులు పొడిగించడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ చెప్పాడు.
-
I left the IPL as it’s half term for my kids and I want to be at home with them. It’s been a strange year, so now they’re off school, I want to be with them all day, everyday. 🙏🏽
— Kevin Pietersen🦏 (@KP24) October 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I left the IPL as it’s half term for my kids and I want to be at home with them. It’s been a strange year, so now they’re off school, I want to be with them all day, everyday. 🙏🏽
— Kevin Pietersen🦏 (@KP24) October 16, 2020I left the IPL as it’s half term for my kids and I want to be at home with them. It’s been a strange year, so now they’re off school, I want to be with them all day, everyday. 🙏🏽
— Kevin Pietersen🦏 (@KP24) October 16, 2020
"నా పిల్లలకు సెలవులు ఉండడం వల్ల ఐపీఎల్ వదిలేసి ఇంటికి వెళ్తున్నా. వాళ్లతో కలిసి ఇంట్లోనే ఉండాలనుకుంటున్నా. ఇదో వింత ఏడాది. ఇప్పుడు పిల్లలకు పాఠశాల కూడా లేదు. కాబట్టి ప్రతిరోజు వాళ్లతోనే సమయం గడపాలని కోరుకుంటున్నా."
- కెవిన్ పీటర్సన్, ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్మన్
అంతే కాకుండా దుబాయ్ నుంచి లండన్ వరకూ సాగిన తన ప్రయాణానికి సంబంధించిన ఓ వీడియోనూ పోస్టు చేశాడు. పీటర్సన్, జెస్సికా టేలర్ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచే ఈ సీజన్‌లో వ్యాఖ్యాతగా అతనికి చివరిది.