దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భుజానికి గాయమైనట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఐదో ఓవర్లో బంతిని ఆపే క్రమంలో ఈ దెబ్బ తగిలింది. వెంటనే మైదానాన్ని వీడాడు. అయితే భుజం కదుల్చుతున్నాడని, ఇప్పుడే ఏం చెప్పలేమని సహచర ఆటగాడు శిఖర్ ధావన్ చెప్పాడు. పూర్తి రిపోర్ట్ రావాల్సిందని అన్నాడు.
అంతకు ముందు గాయాల కారణంగానే దిల్లీ బౌలర్లు ఇషాంత్, అమిత్ మిశ్రా.. ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌కు తొడ కండరాలు పట్టేయడం వల్ల వారం రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు.
12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉన్న దిల్లీకి ప్రస్తుతానికి పర్వాలేదు కానీ పంత్, అయ్యర్ల గాయాలు తగ్గకపోతే రానున్న మ్యాచ్‌ల్లో జట్టుకు కష్టాలు ఎదురుకావచ్చు.
రాజస్థాన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో దిల్లీ క్యాపిటల్స్ గెలుపొందింది. ధావన్ 57, శ్రేయస్ అయ్యర్ 53 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించారు.