ఐపీఎల్లో పాల్గొనేందుకు యూఏఈ చేరుకున్నాడు వెస్టిండీస్ సారథి జాసన్ హోల్డర్. బీసీసీఐ నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఇతడు ఆరు రోజుల క్వారంటైన్లో ఉండనున్నాడు. ఈ సమయంలో ఇతడు మూడుసార్లు కరోనా టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత సన్‌రైజర్స్ జట్టుతో కలవనున్నాడు.
ఇటీవలే మిచెల్ మార్ష్ గాయపడటం వల్ల అతడి స్థానంలో హోల్డర్‌ను తీసుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ. సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు మార్ష్. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల అతడు టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో హోల్డర్‌కు అవకాశం లభించింది.
ఈరోజు సన్‌రైజర్స్.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఆడిన తొలి మ్యాచ్‌ల్లో ఓడిపోయాయి. దీంతో లీగ్‌లో బోణీ కొట్టేందుకు ఇరుజట్లు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి.