ETV Bharat / sports

గ్రీన్ జెర్సీల్లో ఆర్సీబీ క్రికెటర్లు.. ఎందుకంటే? - IPL LATEST NEWS

ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్​తో జరగనున్న మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు గ్రీన్ జెర్సీతో దర్శనమివ్వనున్నారు. పర్యావరణంపై అవగాహన కల్పించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

RCB to wear green jersey in the match against CSK
ఆర్సీబీ గ్రీన్ జెర్సీ
author img

By

Published : Oct 24, 2020, 5:15 PM IST

ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు మైదానంలో ఆకుపచ్చ రంగు జెర్సీల్లో కనిపించనున్నారు. చెన్నైతో ఆదివారం జరిగే మ్యాచ్​లో ఈ దుస్తులతో బరిలో దిగనున్నారు. 'గో గ్రీన్' కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో భాగంగానే ఇలా చేస్తున్నట్లు ఫ్రాంచైజీ ఓ వీడియోను ట్వీట్ చేసింది.

ఇప్పటికే 14 పాయింట్లతో దూకుడు మీదున్న ఆర్సీబీ.. చెన్నైపై గెలిస్తే ఫ్లేఆఫ్స్​లో దాదాపుగా చోటు దక్కించుకుంటుంది. ఫుల్​ఫామ్​లో ఉన్న కోహ్లీసేనకు ఇదేమంతా పెద్ద కష్టం కాకపోవచ్చు. చెన్నై ఏమైనా అద్భుతం చేస్తే తప్ప ఫలితం మారడం అసాధ్యం!

KOHLI
గ్రీన్ జెర్సీలో కెప్టెన్ కోహ్లీ(పాత చిత్రం)

ఇది చదవండి: డివిలియర్స్ మాములోడు కాదు: కోహ్లీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.