ETV Bharat / sports

సైనీ షూస్​పై ఏం రాసుందో తెలుసా?

author img

By

Published : Oct 4, 2020, 8:40 PM IST

శనివారం రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో బెంగళూరు బౌలర్​ నవదీప్​ సైనీ షూస్​పై కొన్ని పదాలు రాసి ఉండటం కనిపించింది. అవి అతడే స్వయంగా రాసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట్లో వైరల్​గా మారింది.

Navdeep Saini
నవ్​దీప్​ శైనీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-రాజస్థాన్​ రాయల్స్​ మధ్య శనివారం జరిగిన మ్యాచ్​లో ఓ ఆసక్తికర అంశం కెమెరా కంటికి చిక్కింది. చివరి ఓవర్లో రాహుల్​ తెవాతియాకు బౌలింగ్​ వేసిన ఆర్సీబీ ఆటగాడు నవదీప్​ సైనీ షూస్​పై కొన్ని పదాలు రాసి ఉండటం కనిపించింది. 'ఎఫ్​*** ఇట్.., బౌల్​ ఫాస్ట్' అని అతడే స్వయంగా రాసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టంట్లో వైరల్​గా మారింది.

Navdeep Saini
నవ్​దీప్​ శైనీ

అయితే ఇలాంటి సంఘటన జరగడం ఇదేం తొలిసారి కాదు. 2019లో పాకిస్థాన్​తో జరిగిన టెస్టు సిరీస్​లోనూ ఆస్ట్రేలియా ఫాస్ట్​ బౌలర్​ మిచెల్​ స్టార్క్​ ఇలాగే చేతి మణికట్టుపై కొన్ని పదాలు రాసుకున్నాడు. అప్పట్లో దీనికి సంబంధించిన ఫొటో బాగా వైరల్​ అయింది. కాగా ఇతడు కూడా 2015లో ఆర్సీబీకి ఆడటం మరో విశేషం.

శనివారం జరిగిన ఐపీఎల్​ మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​పై బెంగళూరు జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 155 పరుగుల లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగిలుండగానే పూర్తి చేసింది. కోహ్లీ(72*), దేవ్​దత్(63) అర్ధ శతకాలతో మెరిశారు.

ఇదీ చూడండి రైనా రికార్డును సమం చేసిన రోహిత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.