ETV Bharat / sports

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో మన అమ్మాయిల విక్టరీ - హాకీ విజేతగా నిలిచిన భారత్

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ - హాకీలో విజేతగా నిలిచిన భారత మహిళలు

WOMENS ASIAN CHAMPIONS TROPHY 2024
WOMENS ASIAN CHAMPIONS TROPHY 2024 (ANI)
author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

Womens Asian Champions Trophy 2024 : ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత అమ్మాయిల హాకీ జట్టు అదరగొట్టింది. బుధవారం జరిగిన ఓటమి అనేది ఎరుగకుండా తాజాగా జరిగిన మ్యాచ్​లో టైటిల్‌ను కైవసం చేసుకుంది. తాజాగా జరిగిన ఫైనల్‌లో 1-0తో చైనాను చిత్తు చేసి విజేతగా నిలిచింది. 31వ నిమిషంలో దీపిక గోల్‌ చేసి భారత్‌ను ఆధిక్యంలో నిలిపింది. తొలి అర్ధ భాగంలో ఇరుజట్లు ఒక్క గోల్‌ చేయకలేకపోయాయి. అయితే భారత్‌కు నాలుగు పెనాల్టీ కార్నర్‌లు లభించినా వాటిని గోల్స్‌గా మలచలేకపోయింది.

ఇక మూడో క్వార్టర్‌ ఆరంభంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను దీపిక గోల్‌గా మలిచింది. రెండో అర్ధ భాగంలో స్కోరును సమం చేయడానికి చైనా ప్రయత్నించగా భారత్ అడ్డుకుంది. ఇక ఈ టోర్నీలో చైనా మూడో రన్నరప్‌గా నిలిచింది. మూడు-నాలుగు స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో జపాన్‌ 4-1తో మలేషియాను ఓడించి మూడో స్థానంలో నిలిచింది. భారత్‌ ఈ టైటిల్‌ను దక్కించుకోవడం ఇది మూడోసారి కాగా, అంతకుముందు సౌత్​కొరియా కూడా మూడుసార్లు ఈ ట్రోఫీని దక్కించుకోవడం గమనార్హం.

బిహార్‌లోని రాజ్‌గిర్‌ వేదికగా జరిగిన సెమీపైనల్‌లోనూ భారత జట్టు విజయం సాధించింది. 2-0 తేడాతో జపాన్‌పై గెలుపొందింది. కాగా, లీగ్‌ దశలో వరుస విజయాలతో అజేయంగా ముందుకు సాగిన సలీమా టీమ్​ సెమీ ఫైనల్‌లోనూ అదే దూకుడు కనబరిచి తుది పోరుకు దూసుకెళ్లింది. తొలి 3 క్వార్టర్స్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ నువ్వా నేనా అనేలా సాగింది. దీంతో ఇరు జట్లు కూడా ఒక్క గోల్‌ కూడా చేయలేకపోయింది. కానీ ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ నాలుగో క్వార్టర్‌లో ఒత్తిడిని చిత్తు చేస్తూ భారత్‌ మహిళల టీమ్ 2 గోల్స్​ను తమ ఖాతాలో వేసుకుంది. ఇక ఇండియన్‌ వైస్‌ కెప్టెన్‌ నవీనీత్‌ కౌర్‌ మొదటి గోల్‌ చేయగా, ఆ తర్వాతి గోల్​ను లాల్‌రెమ్సియామి బాదింది. మరోవైపు చైనా, మలేసియా టీమ్స్ మధ్య జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో 3-1 తేడాతో డ్రాగన్‌ జట్టు జయకేతనం ఎగురవేసింది.

రిటైర్మెంట్ ప్రకటించిన 'హాకీ రాణి' - 29ఏళ్లకే కెరీర్​కు గుడ్​బై

భారత్​కు షాక్- కామన్వెల్త్ గేమ్స్​లో​ నో హాకీ!- కారణం అదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.