ETV Bharat / sports

రాహుల్​.. కోహ్లీ 'కొత్త నిబంధనలు' తెలుసా? - t20 latest news

టీ20 క్రికెట్‌లో ఏదైనా కొత్త నిబంధన తీసుకువచ్చే అవకాశం మీకిస్తే మీరేం చేస్తారు.? అనే అంశంపై కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ మధ్య వీడియో సంభాషణ జరిగింది. కోహ్లీ ఓ సూచన చేయగా.. రాహుల్‌ మాత్రం వింత కోరిక కోరాడు.

I-would-ask-IPL-to-ban-you-and-AB-de-Villiers-from-next-year-KL-Rahul
' కోహ్లీ , డివిలియర్స్​లను టీ20 నుంచి నిషేదించాలి '
author img

By

Published : Oct 16, 2020, 8:02 AM IST

టీ20 లీగ్‌ నుంచి బెంగళూరు బ్యాట్స్‌మెన్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ను నిషేధించాలని పంజాబ్ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్ కోరాడు(సరదాగా). టీ20 క్రికెట్‌లో ఏదైనా కొత్త నిబంధన తీసుకువచ్చే అవకాశం మీకిస్తే మీరేం చేస్తారు.? అనే అంశంపై కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ మధ్య వీడియో సంభాషణ జరిగింది. ఈ కార్యక్రమంలో కేఎల్​ రాహుల్​ ఇలా మాట్లాడారు. 'మీరు ఇప్పటికే క్రికెట్‌లో చాలా సాధించారు. మిగతా వాళ్లకు కూడా ఎంతో కొంత మిగల్చండి' అని రాహుల్‌ సరాదాగా అన్నాడు. కొత్త నిబంధన గురించి మాట్లాడుతూ.. 100మీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లిన సిక్సర్‌కు అదనపు పరుగులు ఇవ్వాలని రాహుల్‌ కోరాడు.

అయితే కోహ్లీ స్పందిస్తూ రాహుల్‌ సూచించిన అదనపు పరుగుల నిబంధనకు నేను సమ్మతిస్తే డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లిన తర్వాత మా బౌలర్ల చేతిలో నా పని అయిపోయినట్లే' అని కోహ్లీ పేర్కొన్నాడు(నవ్వుతూ). కొత్త నిబంధన తీసుకొచ్చే అవకాశం ఉంటే 'మ్యాచ్‌ సందర్భంగా వైడ్‌ లేదా నోబాల్‌ విషయంలో రివ్యూ తీసుకునే అవకాశం ఆటగాళ్లకు ఇవ్వాలి' అని కోహ్లీ అన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.