ETV Bharat / sports

బుమ్రా వికెట్ల పండగ.. తొలి బౌలర్​గా రికార్డు - బుమ్రా ఐపీఎల్ రికార్డు

ఐపీఎల్​లో అద్భుతంగా రాణిస్తున్న స్టార్ పేసర్ బుమ్రా.. 27 వికెట్లు తీసి టాప్​లో ఉన్నాడు. లీగ్ చరిత్రలోనే ఓ సీజన్​లో, ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్​గా నిలిచాడు.

I don't focus on end result, just want to execute role given by team: Jasprit Bumrah
బుమ్రా వికెట్ల పండగ.. తొలి బౌలర్​గా రికార్డు
author img

By

Published : Nov 6, 2020, 2:19 PM IST

యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్​లో అందరికన్నా ముందు ముంబయి ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుంది. గురువారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లోనూ విజయం సాధించి ఫైనల్లోనూ అడుగుపెట్టింది. ఐదోసారి టైటిల్‌పైనా కన్నేసింది. అయితే, ముందెన్నడూ ఇలా వరుసగా ముంబయి, రెండు సీజన్లలో ఫైనల్స్‌ చేరిన దాఖలాలు లేవు. లసిత్‌ మలింగ లాంటి స్టార్‌పేసర్‌ లేకపోయినా ఈసారి ఆ జట్టు విశేషంగా రాణించింది. అందుకు ప్రధాన కారణం జస్ప్రీత్‌ బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌. వీరిద్దరూ లీగ్‌ దశలో ప్రత్యర్థులను హడలెత్తించగా, దిల్లీ మ్యాచ్‌లోనూ నిప్పులు చెరిగే బంతులేశారు. అలా బుమ్రా 4/14, బౌల్ట్‌ 2/9 మెరుగైన గణంకాలు నమోదు చేశారు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా పేసర్‌ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. లీగ్‌ చరిత్రలో ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు 27 తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు.

Jasprit Bumrah
పర్పుల్ క్యాప్​తో బుమ్రా

కివీస్‌ పర్యటనలో విఫలమై..

గతేడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత లండన్‌లో వెన్నెముకకు సంబంధించి శస్త్రచికిత్స చేయించుకున్న బుమ్రా.. కొద్ది నెలలు ఆటకు దూరమయ్యాడు. బెంగళూరు జాతీయ శిక్షణ శిబిరంలో పాల్గొని పూర్తిగా ఫిట్‌నెస్‌ సాధించాడు. దాంతో న్యూజిలాండ్‌ పర్యటనకు ఎంపికైనా ఆశించినంత మేర రాణించలేకపోయాడు. తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక ఇబ్బందులు పడ్డాడు. మొత్తం 5 టీ20ల్లో 5 వికెట్లు, 2 టెస్టుల్లో 6 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇక 3 వన్డేల్లో ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. అయితే, గాయం నుంచి కోలుకొని అప్పుడే తిరిగి జట్టులో చేరడం వల్ల అతడిపై భారీ అంచనాలు పెట్టుకోవడం సబబు కాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఈ సీజన్‌లో రెండుసార్లు..

ఇక సుదీర్ఘ పర్యటన అనంతరం టీమ్‌ఇండియా భారత్‌కు తిరిగొచ్చాక లాక్‌డౌన్‌ అమలు చేశారు. ఆ విధంగా టీమ్‌ఇండియా పేసర్‌కు మంచి విశ్రాంతి దొరికింది. ఈ నేపథ్యంలోనే యూఏఈలో అడుగుపెట్టిన అతడు.. ఈ సీజన్‌లో చెలరేగిపోతున్నాడు. ఇప్పటివరకు మొత్తం 27 వికెట్లు తీశాడు. లీగ్‌ దశలో రాజస్థాన్‌పై 4 వికెట్లు తీయగా దిల్లీపై కూడా అదే ప్రదర్శన చేశాడు. అయితే, ఈసారి 4 ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇవ్వడం వల్ల కెరీర్‌లో అత్యుత్తమ టీ20 గణంకాలు నమోదు చేశాడు. ప్లేఆఫ్స్‌లో ముంబయి తరఫునా ఇదే మెరుగైన ప్రదర్శన. దీంతో ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా కొత్త రికార్డు నెలకొల్పాడు.

Jasprit Bumrah
ముంబయి ఇండియన్స్ బౌలర్ బుమ్రా

భువి, భజ్జీ, జయదేవ్‌లను అధిగమించి..

ఇంతకుముందు హైదరాబాద్‌ పేసర్‌ భువనేశ్వర్‌కుమార్‌ 2017లో 26 వికెట్లు తీసి భారత బౌలర్లలో నంబర్‌ వన్‌గా ఉండేవాడు. అతడి తర్వాత 2013 సీజన్‌లో హర్భజన్‌సింగ్‌ 24 వికెట్లు, 2017లోనే జయదేవ ఉనద్కత్‌ 24 వికెట్లు పడగొట్టారు. క్వాలిఫయర్‌లో దిల్లీ బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌చేసి వీరిందరినీ బుమ్రా అధిగమించాడు. ఇలాగే ఫైనల్‌లోనూ చెలరేగితే మరో కొత్త రికార్డు నెలకొల్పినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇక మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన బుమ్రా.. తాను వికెట్లు తీయకున్నా ముంబయి టోర్నీ గెలిస్తే చాలని చెప్పాడు. వికెట్ల కోసం ఆడనని, అప్పగించిన బాధ్యతను మాత్రమే పూర్తి చేస్తానని అన్నాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.