ETV Bharat / sports

'టీ20 ప్రపంచకప్​నైనా ముంబయి గెలిచేస్తుంది' - ముంబయి ఇండియన్స్​ టీ20 ప్రపంచకప్​నూ గెలుస్తుంది

ఐపీఎల్​లో ఐదోసారి విజేతగా నిలిచిన ముంబయి ఇండియన్స్​ జట్టుపై ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​ మైకేల్ వాన్​ ప్రశంసలు కురిపించాడు. రోహిత్​సేనకు టీ20 ప్రపంచకప్​ గెలిచే సత్తా ఉందని వాన్​ అభిప్రాయపడ్డాడు.

Feel Mumbai Indians could win T20 World Cup: Michael Vaughan
'టీ20 ప్రపంచకప్​నైనా ముంబయి గెలిచేస్తుంది'
author img

By

Published : Nov 11, 2020, 7:21 PM IST

Updated : Nov 11, 2020, 11:00 PM IST

ఐపీఎల్​ 2020లో ముంబయి ఇండియన్స్​ జట్టు ఆరంభంలో కొద్దిగా తడబడినా..ఆధిపత్య ప్రదర్శనతో ప్లేఆఫ్స్​కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఆ తర్వాత ఫైనల్​కు అర్హత సాధించి.. ఐదోసారి విజేతగా నిలిచింది. ఐపీఎల్​లో ఆధిపత్యం చలాయించిన జట్టు టీ20 ప్రపంచకప్​నూ సాధించగలదని ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​ మైకేల్​ వాన్​ అభిప్రాయపడ్డాడు.

"ముంబయి ఇండియన్స్​ జట్టు టీ20 ప్రపంచకప్​ ట్రోఫీని గెలుచుకుంటుందని నేను భావిస్తున్నా" అని మైకేల్​ వాన్​ ట్వీట్​ చేశాడు. ముంబయి ఇండియన్స్​కు కెప్టెన్​గా రోహిత్​శర్మ బాధ్యతలు స్వీకరించిన ఎనిమిదేళ్లలో ఆ జట్టు ఐదోసారి విజేతగా నిలిచింది. ప్రపంచ క్రికెట్​లోనే అత్యంత ఆధిపత్యం చెలాయించే టీ20 జట్లలో ఒకటిగా ముంబయి అవతరించిందని క్రికెట్​ విశ్లేషకులు అంటున్నారు.

తన కెరీర్​లో 15వ టీ20 టైటిల్​ను గెలుచుకున్న ప్రముఖ క్రికెటర్​ కిరన్​ పొలార్డ్​ కూడా మైకేల్​ వాన్​ వ్యాఖ్యలను సమర్థించాడు. "అక్కడ ఎన్ని ట్రోఫీలైతే ఉన్నాయో.. అంతే టాలెంట్​ ఆ జట్టులోని ఆటగాళ్లలో ఉంది. టీ20ల్లో ముంబయి ఇండియన్స్​ ఉత్తమ జట్టు అని చెప్పవచ్చు. ఆ జట్టు యాజమాన్యం, సహాయక సిబ్బంది కృషే అన్ని విజయాలు సాధించడానికి కారణం" అని పొలార్డ్​ తెలిపాడు.

Last Updated : Nov 11, 2020, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.