ETV Bharat / sports

సన్​రైజర్స్​ విజయరహస్యం అదే: భువీ కోచ్ - సన్​రైజర్స్​ హైదరాబాద్​ సంజయ్​ రస్టోగీ

టాస్​ గెలిచి బౌలింగ్​ను ఎంచుకోవడమే ఐపీఎల్​లో హైదరాబాద్ జట్టు​ విజయ రహస్యమని చెప్పారు భువనేశ్వర్​ కుమార్​ చిన్ననాటి కోచ్​ సంజయ్​. ఇదే ఫార్ములాను ఈ ఏడాది కూడా కొనసాగించాలని అన్నారు.

sanjay
సంజయ్​ రాస్టోగీ
author img

By

Published : Sep 26, 2020, 5:22 PM IST

Updated : Sep 26, 2020, 5:40 PM IST

సంజయ్​ రాస్టోగీ

సన్​రైజర్స్​ హైదరాబాద్​ విజయరహస్యాన్నివెల్లడించారు ఆ జట్టులోని బౌలర్ భువనేశ్వర్​ కుమార్​ చిన్ననాటి కోచ్​ సంజయ్​ రాస్తోగి. టాస్​ గెలిచి, బౌలింగ్​ ఎంచుకోవడమే వారికి బలమని చెప్పారు. అందుకే గతేడాది ఎక్కువ మ్యాచులు గెలిచిందని అన్నారు. ఇదే ఫార్ములాను ఈ సీజన్​లోనూ కొనసాగించాలని సూచించారు. తద్వారా ఎక్కువగా గెలిచే అవకాశముందన్నారు. బలమైన బ్యాటింగ్​ లైనప్​ లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ మెగాలీగ్​లో తన ఫేవ్​రేట్​ జట్టు హైదరాబాద్​ అని చెప్పిన సంజయ్​... భువనేశ్వర్​ కుమార్, ప్రియమ్​ గార్గ్ ఆ ఫ్రాంచైజీలో ఉండటమే అందుకు కారణమని అన్నారు.

తర్వాతి(సెప్టెంబరు 26న) మ్యాచ్​లో కోల్​కతాతో సన్​రైజర్స్​ అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే తొలి మ్యాచ్​లో బెంగళూరుపై ఓడిపోయింది. కోల్​కతా నైట్​రైడర్స్, తన మొదటి మ్యాచ్​లో ఓటమిపాలైంది. శనివారం జరిగే మ్యాచ్​లో గెలిచి పాయింట్ల పట్టికలో బోణీ కొట్టాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి.

ఇదీ చూడండి 'రైనా రీఎంట్రీ కోసం ఎదురుచూడట్లేదు'

Last Updated : Sep 26, 2020, 5:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.