ETV Bharat / sports

'బ్రావో కోలుకోవడానికి రెండు వారాలు పట్టొచ్చు'

సీఎస్కే ఆల్​రౌండర్​ డ్వేన్​ బ్రావో రెండు వారాలు మైదానానికి దూరమయ్యే అవకాశం ఉందని చెన్నై జట్టు ప్రధాన కోచ్​ స్టీఫెన్​ ఫ్లెమింగ్​ అన్నాడు. గాయం కారణంగా అతడు కోలుకోవడానికి మరింత సమయం పట్టొచ్చని ఫ్లెమింగ్​ అభిప్రాయపడ్డాడు.

Dwayne Bravo could be out for a couple of weeks, says Stephen Fleming
'బ్రావో కోలుకోవడానికి రెండు వారాలు పట్టొచ్చు'
author img

By

Published : Oct 19, 2020, 8:25 AM IST

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో రెండు వారాలు మైదానానికి దూరమయ్యే సూచనలున్నాయని ఆ జట్టు ప్రధాన కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ చెప్పాడు. దిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో గాయం కావడం వల్ల బ్రావో ఆఖర్లో మైదానం వీడగా.. తప్పనిసరి పరిస్థితుల్లో ధోని చివరి ఓవర్‌ను జడేజాతో వేయించాడు. 17 పరుగులు అవసరమైన ఆ ఓవర్లో అక్షర్‌ పటేల్‌ మూడు సిక్స్‌లు బాది దిల్లీని గెలిపించాడు.

"బ్రావోకు గజ్జల్లో గాయమైనట్లు తెలుస్తోంది. అతను తప్పనిసరి పరిస్థితుల్లో మైదానం వీడాడు. చివరి ఓవర్​ వేయలేకపోయినందుకు డ్వేన్​ ఎంతో నిరాశపడ్డాడు. అతను కోలుకోవడానికి మరో రెండు వారాలు పట్టే అవకాశం ఉంది" అని ఫ్లెమింగ్​ చెప్పాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.