ETV Bharat / sports

'మా జట్టు ఓటమికి ప్రధాన కారణం అతడే' - మార్కస్​ స్టోయినిస్​

ఐపీఎల్​లో తమ జట్టు ఓటమికి దిల్లీ క్యాపిటల్స్​ ఆల్​రౌండర్​ మార్కస్​ స్టోయినిస్​ కారణమని అన్నాడు పంజాబ్​ బ్యాట్స్​మన్​ మయాంక్​ అగర్వాల్​. స్టోయినిస్​ తన ప్రణాళిక సరైన రీతిలో అమలు పరిచి దిల్లీకి పరుగులు రప్పించడంలో విజయం సాధించాడని అన్నాడు.

DC VS KXIP: Mayank Agarwal opens up after heartbreaking loss
'మా జట్టు ఓడిపోవడానికి ప్రధాన కారణం అతడే'
author img

By

Published : Sep 21, 2020, 12:53 PM IST

Updated : Sep 25, 2020, 5:59 PM IST

దిల్లీ క్యాపిటల్స్​ బ్యాట్స్​మన్​ మార్కస్​ స్టోయినిస్ వల్లే తమ జట్టు విజయానికి దూరమైందని అన్నాడు కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ బ్యాట్స్​మన్​ మయాంక్​ అగర్వాల్​. అతడి వల్లే తాము లక్ష్యాన్ని చేరుకోవడానికి మరింత కష్టపడాల్సి వచ్చిందని తెలిపాడు.

"ఈ మ్యాచ్​లో స్టోయినిస్​ అద్భుత ప్రదర్శన చేశాడు. దిల్లీ జట్టు తక్కువ స్కోరు ఉన్నప్పుడు బ్యాటింగ్​ బరిలో దిగి.. డెత్​ ఓవర్లలో పరుగులు రాబట్టాడు. తక్కువ లక్ష్యంతో ఆడొచ్చని అనుకున్నాం. కానీ, అతడి విధ్వంసకర బ్యాటింగ్​ వల్ల ఛేదనలో మేము ఇంకొంత కష్టపడాల్సి వచ్చింది. స్టోయినిస్​ తన ప్రణాళికను చక్కగా అమలు చేశాడు. కేవలం చివరి ఓవర్​లోనే 30 రన్స్​ రాబట్టింది దిల్లీ జట్టు. ఏదిఏమైనా మా తర్వాతి మ్యాచ్​లో ఇలాంటి తప్పిదాలు రాకుండా జాగ్రత్త వహిస్తాం."

- మయాంక్ అగర్వాల్​, కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ బ్యాట్స్​మన్​​

పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో మార్కస్​ స్టోయినిస్​ ఆల్​రౌండ్ ప్రతిభ కనబరిచాడు. బ్యాటింగ్​లో కేవలం 21 బంతులను ఎదుర్కొని 54 పరుగులు రాబట్టాడు. బౌలింగ్​లోనూ మూడు ఓవర్లు వేసి రెండు వికెట్లను దక్కించుకుని 'మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​'గా నిలిచాడు.

DC VS KXIP: Mayank Agarwal opens up after heartbreaking loss
మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్: స్టోయినిస్​​

మయాంక్​ ఇన్నింగ్​ వృథా

తొలుత బ్యాటింగ్‌లో దిల్లీ 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. కష్టతరమైన పిచ్‌పై ఛేదనలో పంజాబ్‌కు శుభారంభం లభించలేదు. దాదాపు 15 ఓవర్ల వరకు నెమ్మదిగానే ఆడింది. అయితే మయాంక్‌ అగర్వాల్‌ (89; 60 బంతుల్లో 7×4, 4×6) గేర్ మార్చడం వల్ల విజయానికి చేరువైంది. ఆఖరి ఓవర్లో 13 పరుగులు చేస్తే విజయం అనగా కింగ్స్‌ 12 పరుగులే చేసింది. ఫలితంగా మ్యాచ్‌ టై అయ్యి సూపర్​ ఓవర్​కు దారితీసింది.

దుబాయ్​ అంతర్జాతీయ స్టేడియంలో సెప్టెంబరు 24న రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టుతో తన తర్వాతి మ్యాచ్​లో తలపడనుంది కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​.

Last Updated : Sep 25, 2020, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.