ETV Bharat / sports

విలియమ్సన్ రనౌట్​తో చాలా బాధపడ్డా: గార్గ్

author img

By

Published : Oct 3, 2020, 11:36 AM IST

Updated : Oct 3, 2020, 11:44 AM IST

సీఎస్కేతో మ్యాచ్​లో విలియమ్సన్​ రనౌట్​ అయినప్పుడు చాలా బాధపడ్డానని ప్రియమ్​ గార్గ్​ చెప్పాడు. ఇందుకు తనే కారణమని భావిస్తుండగా, ఎలాంటి ఆలోచనలు మనసులో పెట్టుకోవద్దని అతడు చెప్పినట్లు పేర్కొన్నాడు.

CSK vs SRH
ప్రియమ్​ గార్గ్​

చెన్నై సూపర్​ కింగ్స్​తో దుబాయ్​ వేదికగా జరిగిన మ్యాచ్​లో కేన్​ విలియమ్సన్​ రనౌట్​ కావడానికి తన తప్పిదమే కారణమని యువ బ్యాట్స్​మన్​ ప్రియమ్​ గార్గ్​ అన్నాడు. ఆ సమయంలో చాలా బాధపడ్డానని చెప్పాడు. పదకొండో ఓవర్ చివరి బంతికి సింగిల్​కు ప్రయత్నించే క్రమంలో 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విలియమ్సన్​ రనౌట్​ అయ్యాడు. ఈ విషయంలో అపరాధ భావనకు లోనవకుండా.. ఆటపై దృష్టి పెట్టమని తనకు అతడు​ చెప్పినట్లు గార్గ్​ వెల్లడించాడు.

"ఆ రనౌట్​ విషయంలో చాలా బాధపడ్డా. ఒక మంచి అనుభవజ్ఞడైన బ్యాట్స్​మన్​ ఔట్​ కావడానికి కారణమయ్యానని అనిపించింది. అయితే, విలియమ్సన్​తో దీనిపై చర్చించినప్పుడు రనౌట్​ గురించి ఎక్కువగా ఆలోచించొద్దని, మర్చిపోయి మ్యాచ్​పై దృష్టిపెట్టమని చెప్పాడు."

ప్రియమ్​ గార్గ్​, హైదరాబాద్​ క్రికెటర్

ప్రియమ్​ గార్గ్​, అభిషేక్​ శర్మ ద్వయం ప్రదర్శన.. హైదరాబాద్​ గెలుపులో కీలక పాత్ర పోషించింది. మ్యాచ్​ చివరి వరకు క్రీజులోనే ఉన్న గార్గ్​.. 26 బంతుల్లో 51 పరుగులు చేసి, ఐపీఎల్​లో తొలి ​ అర్థసెంచరీ చేశాడు. నిర్ణీత 20 ఓవర్లకు సన్​రైజర్స్​ 164 పరుగులు చేయగా, ఛేదనలో చెన్నై.. చివరి వరకు పోరాడి 7 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Last Updated : Oct 3, 2020, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.