ETV Bharat / sports

ఆ పేరుకు కాస్త గౌరవమివ్వండి: క్రిస్​ గేల్​

ఆర్సీబీపై జరిగిన మ్యాచ్​లో అర్ధశతకంతో సత్తాచాటి.. కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ విజయంలో కీలకపాత్ర పోషించాడు క్రిస్​ గేల్​. అయితే 'ది బాస్​' అనే పేరుకు గౌరవమివ్వమని చెప్పడానికే తన బ్యాట్​మీద ఉన్న స్టిక్కర్​ను చూపించానని అంటున్నాడు​.

chris gayle demands some respect on the name after scoring fifty
ఆ పేరుకు కాస్త గౌరవమివ్వండి: క్రిస్​ గేల్​
author img

By

Published : Oct 17, 2020, 6:30 AM IST

ఆలస్యంగా ఐపీఎల్‌ పదమూడో సీజన్‌లో అడుగుపెట్టినప్పటికీ అదిరే ఆటతో క్రిస్‌గేల్‌ ఎప్పటిలాగే వినోదాన్ని పంచాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో అర్ధశతకంతో సత్తాచాటి పంజాబ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. గురువారం మ్యాచ్‌లో అర్ధసెంచరీ చేరుకున్న తర్వాత తన బ్యాట్‌పై ఉన్న 'ది బాస్‌' అనే స్టిక్కర్‌ను చూపిస్తూ అతను సంబరాలు చేసుకున్నాడు. అయితే అతనా సమయంలో బ్యాట్‌ను తలకిందులుగా పట్టుకున్నాడు.

మ్యాచ్‌ తర్వాత గేల్‌ మాట్లాడుతూ.. "ఆ పేరుకు కాస్త గౌరవమివ్వండి అని చెప్పాలకున్నా" అని తన చర్య వెనక ఉన్న ఉద్దేశాన్ని వెల్లడించాడు. అయితే స్టిక్కర్‌ను చూపించే సమయంలో బ్యాట్‌ను తలకిందులుగా పట్టుకున్నావని వ్యాఖ్యాత చెప్పగానే గేల్‌ నవ్వేశాడు.

గొప్ప వ్యక్తిత్వం

మరోవైపు గేల్‌ది గొప్ప వ్యక్తిత్వమని టీమ్‌ఇండియా కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ.. "ఆటలో ఉత్తమ వ్యక్తిత్వమున్న వాళ్లలో గేల్‌ ఒకడు. అతను టోర్నీకే వెలుగులు తెచ్చాడు. తన ఆట ద్వారా గొప్ప వినోదాన్ని పంచిన క్రికెటర్‌గా ఎప్పటికీ గుర్తుండిపోతాడు" అని చెప్పాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.