ఐపీఎల్లో అరంగేట్రం చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్.. దిల్లీతో మ్యాచ్‌లో ఒత్తిడి కంటే ఉత్సాహంతోనే ఆడినట్లు చెప్పాడు. జట్టును గెలిపించాలనే లక్ష్యంతో మెరుగైన ప్రదర్శన ఇవ్వడంపైనే తాను దృష్టి సారించినట్లు వెల్లడించాడు.
"తొలి మ్యాచ్‌లో మొదట కాస్త ఒత్తిడిగా అనిపించినా, తర్వాత ఎంతో ఉత్సాహంతో ఆడాను. మెరుగైన ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించాలనే లక్ష్యంతో ఉన్నాను. ఈ ఐపీఎల్లో మా జట్టు బాగా రాణిస్తుందని ఆనుకుంటున్నాను"
-రవి బిష్ణోయ్, పంజాబ్ బౌలర్
ఆదివారం సాయంత్రం జరిగిన ఈ మ్యాచ్‌లో రవి బిష్ణోయ్, తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. అద్భుత గూగ్లీలతో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే పంత్‌ను క్లీన్ బౌల్డ్ చేసి మెప్పించాడు. మొత్తంగా 4 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి ఓ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఎలాంటి వ్యూహం, ప్రణాళిక లేకుండానే పంత్‌ను ఔట్ చేసినట్లు చెప్పాడు.
ఇదీ చూడండి అంపైరింగ్ తప్పిదంపై కేఎల్ రాహుల్ ఫిర్యాదు!