మహిళల టీ20 ఛాలెంజ్‌లో వెలాసిటీతో తలపడుతున్న మ్యాచ్‌లో సూపర్నోవాస్ 142 పరుగులు చేసింది. జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రోడ్రిగ్స్(77) అర్ధశతకంతో అదరగొట్టగా... చమారి అటపట్టు 31 పరుగులతో రాణించింది. వెలాసిటీ బౌలర్లలో అమిలీయా రెండు వికెట్లు తీయగా.. శిఖా పాండే ఓ వికెట్‌ను తన ఖాతాలో వేసుకుంది.
-
What an innings, @JemiRodrigues 👏👏 pic.twitter.com/0NquBl1cmj
— IndianPremierLeague (@IPL) May 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">What an innings, @JemiRodrigues 👏👏 pic.twitter.com/0NquBl1cmj
— IndianPremierLeague (@IPL) May 9, 2019What an innings, @JemiRodrigues 👏👏 pic.twitter.com/0NquBl1cmj
— IndianPremierLeague (@IPL) May 9, 2019
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సూపర్నోవాస్ ఆరంభంలోనే ప్రియా(16) వికెట్‌ను కోల్పోయింది. అనంతరం చమారి అటపట్టు - రోడ్రిగ్స్ జోడి నిలకడగా ఆడుతూ జట్టుకు భారీ స్కోరును అందించింది. 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అటపట్టు ఔటైనా.. రోడ్రిగ్స్ మాత్రం విజృంభించింది.
రోడ్రిగ్స్ అర్ధశతకం..
నిదానంగా ఇన్నింగ్స్ మొదలు పెట్టిన రోడ్రిగ్స్... అనంతరం బ్యాట్ ఝుళిపించింది. 48 బంతుల్లో 77 పరుగులతో చక్కటి ప్రదర్శన చేసింది. 31 బంతుల్లోనే అర్ధశతకం చేసింది. చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ స్కోరు వేగాన్ని పెంచింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెలాసిటీ జట్టు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రెండు క్యాచ్‌లు జారవిడవడం, ఫీల్డింగ్ తప్పిదాలతో మూల్యాన్ని చెల్లించుకుంది.