ఐపీఎల్ 16వ మ్యాచ్‌లో హైదరాబాద్, దిల్లీ క్యాపిటల్స్ జట్లు.. రాజధాని నగరంలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ సారథి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లూ రెండు విజయాలతో ఉన్నాయి.
The @SunRisers win the toss and elect to bowl first against @DelhiCapitals #DCvSRH pic.twitter.com/QCoVjcWYr4
— IndianPremierLeague (@IPL) April 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The @SunRisers win the toss and elect to bowl first against @DelhiCapitals #DCvSRH pic.twitter.com/QCoVjcWYr4
— IndianPremierLeague (@IPL) April 4, 2019The @SunRisers win the toss and elect to bowl first against @DelhiCapitals #DCvSRH pic.twitter.com/QCoVjcWYr4
— IndianPremierLeague (@IPL) April 4, 2019
దిల్లీ చివరి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఆఖర్లో అనూహ్యంగా వికెట్లు కోల్పోయి మ్యాచ్ చేజార్చుకుంది. నిలకడగా రాణించకపోవటం ప్రతికూలంగా మారింది. హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లో సునాయాసంగా విజయాలు సాధించింది. ఈ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మంచి రికార్డు ఉంది. ఈ వేదికలో నాలుగు సార్లు ఈ రెండు జట్లు తలపడగా మూడు సార్లు హైదరాబాద్‌దే పైచేయి. ఒక్కసారి మాత్రం దిల్లీ గెలిచింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంతవరకూ ఒక్కసారి కూడా పవర్‌ప్లేలో వికెట్ కోల్పోలేదు.
- జట్లు ..
సన్ రైజర్స్ హైదరాబాద్: భువనేశ్వర్‌కుమార్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో(వికెట్ కీపర్), విజయ్‌శంకర్, యూసుఫ్ పఠాన్, మనీశ్‌పాండే, దీపక్ హుడా, మహ్మద్ నబీ, రషీద్‌ఖాన్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్.
దిల్లీ క్యాపిటల్స్ : శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), పృథ్వీ షా, శిఖర్ ధావన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇంగ్రామ్, క్రిస్ మోరిస్, అక్షర్ పటేల్, కగిసో రబాడ, సందీప్, రాహుల్, ఇషాంత్ శర్మ.