లిన్, నరైన్,రసెల్ లాంటి హిట్టర్లున్న జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్. అయినా గత ఐదు మ్యాచ్‌ల్లో ఓటములే ఎదురయ్యాయి. ఈరోజు రాజస్థాన్‌తో పోరులో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. మరి ఓటములు నుంచి బయటపడి కేకేఆర్ విజయం సాధిస్తుందే లేదో తెలియాలంటే మ్యాచ్ చూడాల్సిందే.
-
It's Narine's turn to go BIG! 🔥
— KolkataKnightRiders (@KKRiders) April 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Our 💥 opener went all guns blazing by smacking the ball to all parts of Eden at training last night! 📹#KKRHaiTaiyaar @SunilPNarine74 pic.twitter.com/XNuwJ4KClg
">It's Narine's turn to go BIG! 🔥
— KolkataKnightRiders (@KKRiders) April 24, 2019
Our 💥 opener went all guns blazing by smacking the ball to all parts of Eden at training last night! 📹#KKRHaiTaiyaar @SunilPNarine74 pic.twitter.com/XNuwJ4KClgIt's Narine's turn to go BIG! 🔥
— KolkataKnightRiders (@KKRiders) April 24, 2019
Our 💥 opener went all guns blazing by smacking the ball to all parts of Eden at training last night! 📹#KKRHaiTaiyaar @SunilPNarine74 pic.twitter.com/XNuwJ4KClg
ప్రపంచకప్‌కు వెళ్లే టీమిండియా జట్టులో దినేశ్ కార్తిక్‌ను రెండో వికెట్ కీపర్‌గా ఎంచుకున్నారు. కానీ ఐపీఎల్లో మాత్రం అతడి ప్రదర్శన మరీ తీసికట్టుగా ఉంది. గత సీజన్లో ఇదే జట్టు తరఫున అద్భుతంగా రాణించిన దినేశ్...ఈ సారి తొమ్మిది మ్యాచ్‌ల్లో 16.71 సగటుతో పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు.
కేకేఆర్‌లో దినేశ్ కాకుండా మిగతా భారత క్రికెటర్స్ ఆట ఏమంత మెరుగ్గా లేదు. కుల్దీప్ యాదవ్ కూడా అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోతున్నాడు. సహచర స్పిన్నర్లు పియూష్ చావ్లా, నరైన్ ప్రభావం చూపలేకపోతున్నారు. ఆడిన 10 మ్యాచ్‌ల్లో కలిపి వీరు ముగ్గరు 16 వికెట్లు మాత్రమే తీయగలిగారు. పేస్ విభాగం మరింత మెరుగుపడాల్సి ఉంది.
"జట్టులోని సభ్యులందరూ ఆటతో అలసిపోయారు. వారికి కొంచెం విశ్రాంతి అవసరం. దినేశ్ కార్తిక్ ఇంటికి వెళ్లి వచ్చాడు. మిగతా వారు కూడా తగినంత విశ్రాంతి తీసుకుని మిగతా మ్యాచ్‌ల్లో రాణిస్తారని అనుకుంటున్నా" -జాక్వెస్ కలిస్, కోల్‌కతా కోచ్
రాజస్థాన్ రాయల్స్.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో దిగువ నుంచి రెండో స్థానంలో ఉంది. కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్‌ను నియమిన మ్యాచ్‌లోనే బలమైన ముంబయిపై విజయం సాధించింది.
-
The last time we played KKR, the skipper scored a 59-ball 73* 🙌🏾@stevesmith49 will be looking to complete a hat-trick of 50s come tomorrow! #HallaBol pic.twitter.com/I4krrEqgQl
— Rajasthan Royals (@rajasthanroyals) April 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The last time we played KKR, the skipper scored a 59-ball 73* 🙌🏾@stevesmith49 will be looking to complete a hat-trick of 50s come tomorrow! #HallaBol pic.twitter.com/I4krrEqgQl
— Rajasthan Royals (@rajasthanroyals) April 24, 2019The last time we played KKR, the skipper scored a 59-ball 73* 🙌🏾@stevesmith49 will be looking to complete a hat-trick of 50s come tomorrow! #HallaBol pic.twitter.com/I4krrEqgQl
— Rajasthan Royals (@rajasthanroyals) April 24, 2019
దిల్లీతో జరిగిన గత మ్యాచ్‌లో రాజస్థాన్ ఓపెనర్ రహానే సెంచరీతో చెలరేగి ఫామ్‌లోకి వచ్చాడు. ఇది కొంత మేర ఆనందించాల్సిన విషయమే. జట్టు గెలవాలంటే మిగతా బ్యాట్స్‌మెన్‌లో సంజూ శాంసన్, రియాన్ పరాగ్, స్టోక్స్ రాణించాల్సిన అవసరముంది.
బౌలర్లలో ఆర్చర్, శ్రేయస్ గోపాల్, ఉనద్కత్, పరాగ్.. ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.
జట్లు (అంచనా)
రాజస్థాన్ రాయల్స్
స్టీవ్ స్మిత్(కెప్టెన్),అజింక్యా రహానే, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, జాస్ బట్లర్, సంజూ శాంసన్, స్టువర్ట్ బిన్ని, శ్రేయాస్ గోపాల్, ఉనద్కత్, రియాన్ పరాగ్, ధవల్ కులకర్ణి
కోల్‌కతా నైట్‌రైడర్స్
దినేశ్ కార్తీక్(కెప్టెన్), క్రిస్‌లిన్, శుభ్‌మన్ గిల్, ఆండ్రూ రసెల్, సునీల్ నరైన్, పీయూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, నితీశ్ రాణా, ప్రసిధ్ క్రిష్ణ, జో డెన్లీ