ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గెలిచి అగ్రస్థానాన్ని పదిలపరచు కోవాలనుకుంటోంది హైదరాబాద్. తమ చివరి మ్యాచ్‌లో జోరు మీదున్న చెన్నైను ఓడించి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది ముంబయి జట్టు.
గత సీజన్లో ముంబయితో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ సత్తా చాటింది హైదరాబాద్. ఆ 2 మ్యాచుల్లోనూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రషీద్ ఖానే కావడం గమనార్హం. మరోసారి అలాగే ఆకట్టుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. రషీద్‌కు నబీ కూడా తోడు కావడంతో సన్‌రైజర్స్ స్పిన్ విభాగం బలోపేతమైంది. ఇంక ఓపెనర్లు వార్నర్- బెయిర్‌స్టోలు భీకరమైన ఫామ్‌లో ఉండటం హైదరాబాద్‌కు కలిసొచ్చే అంశం.
ఐపీఎల్లో 100 విజయాలు అందుకుని ఊపు మీద ఉంది ముంబయి. టాప్ఆర్డర్ విఫలమవుతున్నప్పటికీ సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్య నిలకడగా రాణిస్తున్నారు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తీసి హార్దిక్ పాండ్య మంచి ఫామ్‌లో ఉన్నాడు. బ్యాటింగ్‌లోనూ చివర్లో ఎలాగూ చెలరేగిపోతున్నాడీ ఆల్‌రౌండర్.
జస్ప్రీత్ బుమ్రా.. ముంబయికి బౌలింగ్‌లో ప్రధాన అస్త్రం. హైదరాబాద్ ఓపెనర్లు వార్నర్, బెయిర్‌స్టోలు పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను తమ వైపునకు తిప్పుకుంటున్నారు. వీలైనంత త్వరగా వీరిని ఔట్ చేయాలి. లేకుంటే ముంబయి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.
జట్లు..
సన్‌రైజర్స్ హైదరాబాద్:
భువనేశ్వర్ కుమార్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, విజయ్‌శంకర్, మనీశ్ పాండే, దీపక్ హుడా, యూసుఫ్ పఠాన్, నబీ, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్.
ముంబయి ఇండియన్స్:
రోహిత్ శర్మ(కెప్టెన్), డికాక్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్య, హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్, రాహుల్ చాహర్, బుమ్రా, జోసెఫ్, జాసన్ బెరెన్‌డార్ఫ్.