గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో గెలిచి జోరు మీదుంది రాజస్థాన్ రాయల్స్. దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయి ప్లే ఆఫ్ ఆశలపై నీళ్లు చల్లుకుంది బెంగళూరు. ఈ రెండింటి మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి.
-
Our 🎯 is 14, and we are going all out! 🙌🏾 #HallaBol pic.twitter.com/ZaVbzdxkWC
— Rajasthan Royals (@rajasthanroyals) April 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Our 🎯 is 14, and we are going all out! 🙌🏾 #HallaBol pic.twitter.com/ZaVbzdxkWC
— Rajasthan Royals (@rajasthanroyals) April 29, 2019Our 🎯 is 14, and we are going all out! 🙌🏾 #HallaBol pic.twitter.com/ZaVbzdxkWC
— Rajasthan Royals (@rajasthanroyals) April 29, 2019
12 మ్యాచ్‌లాడిన రాజస్థాన్ ఐదింటిలో నెగ్గి పాయిట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్‌కు దాదాపు దూరమైనప్పటికీ అదృష్టం కలిసొస్తే రాజస్థాన్‌కు టాప్-4లో నిలిచే అవకాశముంది. దిల్లీతో గత మ్యాచ్‌లో ఓడిపోయిన బెంగళూరు ప్లేఆఫ్ పోటీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో నెగ్గి పరువు దక్కించుకోవాలనుకుంటోంది.
రాజస్థాన్ రాయల్స్..
ఈ మ్యాచ్ అనంతరం స్టీవ్‌స్మిత్ ప్రపంచకప్ దృష్ట్యా స్వదేశానికి వెళ్లనున్నాడు. ఎలాగైన ఈ మ్యాచ్‌లో గెలిచి జట్టుకు విజయాన్నందించి వీడ్కోలు పలకాలనుకుంటున్నాడు. ఈ మ్యాచ్‌కు జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ దూరమయ్యే అవకాశం కూడా ఉంది. రాజస్థాన్‌పై ఎక్కువ ఒత్తిడి పడనుంది. ఇప్పటికే ఇంగ్లండ్ ప్రపంచకప్ జట్టుతో కలిశాడు బట్లర్. కోల్‌కతాపై జరిగిన మ్యాచ్‌లో రియాన్ పరాగ్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. బౌలింగ్‌లో శ్రేయాస్ గోపాల్ రాజస్థాన్‌కు ప్రధాన అస్త్రం. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో తన గూగ్లీలతో విరాట్ కోహ్లీ, డివిలియర్స్, హిట్మైర్ లాంటి బ్యాట్స్‌మెన్‌నే పెవిలియన్‌కు పంపాడు. సంజూ సాంసన్, అజింక్య రహానేలు నిలకడగా రాణిస్తున్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
దిల్లీపై ఓడిన బెంగళూరు ప్లే ఆఫ్ ఆశలపై నీళ్లు చల్లుకుంది. ఇప్పటికే 12 మ్యాచ్ లాడిన ఆర్సీబీ నాలుగింట మినహా మిగతా మ్యాచ్‌లన్నింటిలో పరాజయం చెందింది. మిగిలిన రెండు మ్యాచ్‌లో విజయం సాధించి సీజన్‌ను ముగిద్దామనుకుంటోంది బెంగళూరు. కోహ్లీ, డివిలియర్స్, పార్ధివ్ పటేల్ బ్యాటింగ్‌లో అదరగొడుతున్నారు. బౌలింగ్‌లో చాహల్, నవదీప్ సైనీ ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నారు.
జట్లు (అంచనా)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), పార్థివ్ పటేల్, డివిలియర్స్, ఉమేష్ యాదవ్, మొయిన్ అలీ, చాహల్, అక్షదీప్ నాథ్, స్టోయినిస్, నవదీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే
రాజస్థాన్ రాయల్స్
అజింక్య రహానే, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), థామస్, లివింగ్ స్టోన్, సంజూ శాంసన్, స్టువర్ట్ బిన్ని, శ్రేయాస్ గోపాల్, ఉనద్కత్, రియాన్ పరాగ్, ధవల్ కులకర్ణి, వరుణ్ ఆరోన్