మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబయి జట్టు 50 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది. సూర్యకుమార్, కృనాల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో స్కోరు బోర్డు పరుగులెట్టింది. చివరి ఓవర్లో హర్దిక్ హిట్టింగ్‌కు 170 పరుగులు చేసింది ముంబయి.
Innings Break!
— IndianPremierLeague (@IPL) April 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Half century from @surya_14kumar and quick fire innings from Hardik and Pollard propel the @mipaltan total to 170/5. Is this enough to defend?
Live - https://t.co/a5RCCbig2r #MIvCSK pic.twitter.com/cMrWtbuoSk
">Innings Break!
— IndianPremierLeague (@IPL) April 3, 2019
Half century from @surya_14kumar and quick fire innings from Hardik and Pollard propel the @mipaltan total to 170/5. Is this enough to defend?
Live - https://t.co/a5RCCbig2r #MIvCSK pic.twitter.com/cMrWtbuoSkInnings Break!
— IndianPremierLeague (@IPL) April 3, 2019
Half century from @surya_14kumar and quick fire innings from Hardik and Pollard propel the @mipaltan total to 170/5. Is this enough to defend?
Live - https://t.co/a5RCCbig2r #MIvCSK pic.twitter.com/cMrWtbuoSk
- ఓపెనర్లు నిరాశ....
తొలుత బ్యాటింగ్ ఆరంభించిన ముంబయి జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 8 పరుగుల వద్దే తొలి వికెట్‌గా డికాక్(4) ఔటయ్యాడు. వెనువెంటనే రోహిత్(13), యువరాజ్(4) రన్స్ మాత్రమే చేసి పెవిలియన్ చేరారు.
- అదరగొట్టిన సూర్యకుమార్...
వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడాడు. వీలైనపుడు ఫోర్లతో అలరించాడు. మోహిత్ వేసిన 16.5వ ఓవర్లో సిక్స్‌తో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. చివరికి 43 బంతుల్లో 59 పరుగులు(8ఫోర్లు, ఒక సిక్స్)చేసి ఔటయ్యాడు.
- రెండు సార్లు ఛాన్స్...
కృనాల్ (31), సూర్యతో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఇన్నింగ్స్ నడిపించాడు. కృనాల్ రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బ్రావో బౌలింగ్‌లో మోహిత్ క్యాచ్ పట్టడంలో విఫలమయ్యాడు. మరోసారి అంపైర్ ఔటిచ్చినా.. రివ్యూలో విజయవంతమయ్యాడు పాండ్య.
రెండు అవకాశాలు వచ్చినా అర్ధ సెంచరీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. 16.3వ ఓవర్లో 42 పరుగుల వద్ద మోహిత్ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
- చివర్లో విరుచుకుపడిన హార్దిక్...
19 ఓవర్లకు ముంబయి స్కోరు 141. ఇన్నింగ్స్ ముగిసేసరికి 170 పరుగులు చేసిందంటే హార్దిక్ హిట్టింగే కారణం. చివరి ఓవర్లో 29 పరుగులు రాబట్టింది ముంబయి. ఆఖరి ఓవర్ వేసిన బ్రావో బౌలింగ్‌లో 29 పరుగులు పిండుకున్నారు పాండ్య, పొలార్డ్‌లు. దీంతో 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది ముంబయి జట్టు. 8 బంతుల్లోనే ఒక ఫోర్, 3 సిక్సర్లతో 25 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు హార్దిక్. పొలార్డ్ 7 బంతుల్లో రెండు సిక్సర్లతో 17 పరుగులు చేశాడు.
చెన్నై బౌలర్లలో శార్దుల్ మినహా అందరూ ఒక్కో వికెట్ తీశారు. రెండు ఓవర్లు బౌలింగ్ చేసినజడేజా...10 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు.