ఐపీఎల్ 12వ సీజన్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మొహాలీలో నేడు మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది.
ఇప్పటి వరకు రెండు జట్లు చెరో ఐదు మ్యాచ్‌లు ఆడగా...మూడేసి విజయాలు తమ ఖాతాలో వేసుకున్నాయి. రన్‌రేట్ మెరుగ్గా ఉండటం వల్ల మూడో స్థానంలో నిలిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్.
-
Ashwin calls it right at the toss and elects to bowl first in Mohali.#KXIPvSRH pic.twitter.com/crkk7StsjQ
— IndianPremierLeague (@IPL) April 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ashwin calls it right at the toss and elects to bowl first in Mohali.#KXIPvSRH pic.twitter.com/crkk7StsjQ
— IndianPremierLeague (@IPL) April 8, 2019Ashwin calls it right at the toss and elects to bowl first in Mohali.#KXIPvSRH pic.twitter.com/crkk7StsjQ
— IndianPremierLeague (@IPL) April 8, 2019
- రెండు జట్లను మిడిలార్డర్ సమస్య వేధిస్తోంది. ఓపెనర్లు శుభారంభం అందించినా మిడిలార్డర్‌లో నిలదొక్కుకుని జట్టును ఆదుకునే ఆటగాళ్లు కరవయ్యారు. రెండు జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో ఈ వైఫల్యంతోనే ఓటమిపాలయ్యాయి.
ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టోలపైనే సన్‌రైజర్స్ ఎక్కువగా ఆధారపడుతోంది. మిడిలార్డర్ రాణించాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. అలాగే సొంతగడ్డపై పరిస్థితులను సద్వినియోగం చేసుకొని మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని పంజాబ్ భావిస్తోంది.
సన్‌రైజర్స్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. పంజాబ్ అంకిత్, రహమాన్‌లను ఈరోజు మ్యాచ్‌లోకి దించుతోంది. మురుగన్ అశ్విన్, ఆండ్రూ టై కు విశ్రాంతి నిచ్చింది.
-
Two changes for the home team whereas the @SunRisers field the same squad #KXIPvSRH pic.twitter.com/cbGe60EUKg
— IndianPremierLeague (@IPL) April 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Two changes for the home team whereas the @SunRisers field the same squad #KXIPvSRH pic.twitter.com/cbGe60EUKg
— IndianPremierLeague (@IPL) April 8, 2019Two changes for the home team whereas the @SunRisers field the same squad #KXIPvSRH pic.twitter.com/cbGe60EUKg
— IndianPremierLeague (@IPL) April 8, 2019
జట్ల అంచనా..
- సన్‌రైజర్స్ హైదరాబాద్:
భువనేశ్వర్ కుమార్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, విజయ్‌శంకర్, మనీశ్ పాండే, దీపక్ హుడా, యూసఫ్ పఠాన్, నబీ, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్.
- కింగ్స్ ఎలెవన్ పంజాబ్:
రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), లోకేశ్ రాహుల్ (కీపర్), క్రిస్ గేల్, సామ్ కరన్, మయాంక్ అగర్వాల్, సర్ఫ్రాజ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, మన్దీప్ సింగ్, షమి, అంకిత్ రాజ్‌పుత్, మజీబ్ ఉర్ రహామాన్.