స్కోరు ఎక్కువేం చేయలేదు... ఆరంభంలో వికెట్లు తీయలేదు... పవర్ ప్లేలోనే గెలిచేందుకు కావాల్సిన మూడోవంతు స్కోరు చేసేసింది ప్రత్యర్థి చెన్నై.. ఇలాంటి పరిస్థితులనుంచి తేరుకుని అద్భుతమే చేసింది ముంబయి ఇండియన్స్. చెన్నైతో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో ఒక్క పరుగు తేడాతో గెలిచింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబయి బౌలర్లు సమష్టిగా రాణించారు. ముంబయి బౌలర్లలో బుమ్రా నాలుగు ఓవర్లకు 14 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చివర్లో తొమ్మిది పరుగులు చేయకుండా చెన్నైని కట్టడి చేశాడు మలింగ. 4 ఓవర్లు వేసి కేవలం 14 పరుగులే ఇచ్చి ఓ వికెట్ తీశాడు రాహుల్ చాహర్. బౌలర్ల అద్భుత్ ప్రదర్శనతో ఫైనల్లో గెలిచిన ముంబయి.. నాలుగో సారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు బుమ్రాకు దక్కింది.
-
Unprecedented scenes from Hyderabad as @mipaltan became #VIVOIPL champs for the 4⃣th time!
— IndianPremierLeague (@IPL) May 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Lasith Malinga showing his true class in the last over 😎#MIvCSK pic.twitter.com/ZzVK0KHx5O
">Unprecedented scenes from Hyderabad as @mipaltan became #VIVOIPL champs for the 4⃣th time!
— IndianPremierLeague (@IPL) May 12, 2019
Lasith Malinga showing his true class in the last over 😎#MIvCSK pic.twitter.com/ZzVK0KHx5OUnprecedented scenes from Hyderabad as @mipaltan became #VIVOIPL champs for the 4⃣th time!
— IndianPremierLeague (@IPL) May 12, 2019
Lasith Malinga showing his true class in the last over 😎#MIvCSK pic.twitter.com/ZzVK0KHx5O
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ ధాటిగా ఆరంభించింది చెన్నై. డుప్లెసిస్(26) నిలకడగా ఆడగా.. షేన్ వాట్సన్ 80 పరుగులతో ఆకట్టుకున్నాడు. మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమైనా.. చివరి వరకు క్రీజులో నిలిచాడు వాట్సన్. 15 ఓవర్లకు 88 పరుగులే చేసింది చెన్నై జట్టు. మలింగ వేసిన 16 ఓవర్లో 20 పరుగులు కొట్టింది వాట్సన్- బ్రేవో(15) జోడి. కృనాల్ పాండ్య వేసిన 18 ఓవర్లో 20 పరుగులు పిండుకుని చెన్నై అభిమానుల్లో ఆశలు రేకిత్తించాడు వాట్సన్.
మలింగ మాయ..
చివరి ఓవర్‌కు 9 పరుగులు అవసరమవగా.. తొలి బంతికి సింగిల్ వచ్చింది. రెండు, మూడు బంతుల్లో నాలుగు పరుగులు సాధించిన వాట్సన్ నాలుగో బంతికి రనౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన శార్దుల్ ఠాకుర్ 2 పరుగులు చేశాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన తరుణంలో స్లో బాల్ వేసి శార్దుల్ ఎల్బీడబ్ల్యూ చేశాడు మలింగ. దీంతో నాలుగోసారి కప్పు కైవసం చేసుకుంది ముంబయి ఇండియన్స్.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టులో పొలార్డ్(41), డికాక్(29) ఆకట్టుకున్నారు. చివర్లో పొలార్డ్ మెరుపులు మెరిపించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 3 వికెట్లతో ఆకట్టుకోగా.. తాహిర్, శార్దుల్ ఠాకుర్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.