ఆదివారం జరిగిన మ్యాచ్‌ల్లో కోల్‌కతా, బెంగళూరు జట్లు కొత్త రికార్డులు నమోదుచేశాయి. టీ 20ల్లో(ఐపీఎల్, ఛాంపియన్స్ లీగ్) కోల్‌కతా వందో విజయాన్ని అందుకోగా.. ఆదివారం జరిగిన ఇంకో మ్యాచ్‌లో బెంగళూరు టీ 20ల్లో వందో పరాభవాన్ని మూటకట్టుకుంది.
ఈడెన్‌గార్డెన్స్ వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వందో విజయాన్నందుకుంది కోల్‌కతా. రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌తో 100 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ముంబయికి సారథ్యం వహించిన కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు.
-
No better place than 🏠 to get to our 1⃣0⃣0⃣th T20 win 🏟#KKRvMI #VIVOIPL #IPL #KorboLorboJeetbo #KKRHaiTaiyaar pic.twitter.com/DGI5k0Jdh6
— KolkataKnightRiders (@KKRiders) April 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">No better place than 🏠 to get to our 1⃣0⃣0⃣th T20 win 🏟#KKRvMI #VIVOIPL #IPL #KorboLorboJeetbo #KKRHaiTaiyaar pic.twitter.com/DGI5k0Jdh6
— KolkataKnightRiders (@KKRiders) April 28, 2019No better place than 🏠 to get to our 1⃣0⃣0⃣th T20 win 🏟#KKRvMI #VIVOIPL #IPL #KorboLorboJeetbo #KKRHaiTaiyaar pic.twitter.com/DGI5k0Jdh6
— KolkataKnightRiders (@KKRiders) April 28, 2019
ఫీరోజ్షా కోట్లా వేదికగా జరిగిన మ్యాచ్‌లో దిల్లీపై బెంగళూరు ఓడిపోయింది. ఈ పరాభవం ఆర్సీబీకి టీ 20ల్లో వందో ఓటమి. ఈ ఐపీఎల్ సీజన్లో ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఎనిమిదింటిలో ఓడి.. ప్లే ఆఫ్‌కు దాదాపు దూరమైంది బెంగళూరు.
కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఒకే రోజు ఐపీఎల్ అరంగేట్రం చేయడం విశేషం. 2008 ఏప్రిల్ 18న తమ తొలి మ్యాచ్ ఆడాయి.