ఐపీఎల్‌లో హైదరాబాద్ క్రికెటర్‌కు చోటు దక్కింది. ముషీరాబాద్‌లోని రాంనగర్‌కు చెందిన బి. సందీప్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసింది. కోల్‌కతాలో గురువారం జరిగిన వేలంలో రూ.20 లక్షలకు దక్కించుకుంది. ఐపీఎల్‌కు ఎంపిక కావడం పట్ల సందీప్ ఆనందం వ్యక్తం చేశాడు. మన హైదరాబాద్ జట్టు తరఫున ఆడడానికి చాలా ఉత్సుకతతో ఉన్నాను. త్వరలో మైదానంలో కలుద్దాం అని ట్విట్టర్ వీడియోలో పేర్కొన్నాడు.
-
He's from #Hyderabad and he's one of our own 🧡
— SunRisers Hyderabad (@SunRisers) December 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Welcome to #SRH, Sandeep Bavanaka!#IPLAuction #SRH2020Unlocked #OrangeArmy pic.twitter.com/Lq7VwasaJ2
">He's from #Hyderabad and he's one of our own 🧡
— SunRisers Hyderabad (@SunRisers) December 19, 2019
Welcome to #SRH, Sandeep Bavanaka!#IPLAuction #SRH2020Unlocked #OrangeArmy pic.twitter.com/Lq7VwasaJ2He's from #Hyderabad and he's one of our own 🧡
— SunRisers Hyderabad (@SunRisers) December 19, 2019
Welcome to #SRH, Sandeep Bavanaka!#IPLAuction #SRH2020Unlocked #OrangeArmy pic.twitter.com/Lq7VwasaJ2
మరోవైపు సందీప్ ఐపీఎల్‌కు ఎంపికవడంపై అతని తల్లిదండ్రులతో పాటు కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సందీప్ తండ్రి పరమేశ్వర్, తల్లి ఉమారాణి. సందీప్‌కు నలుగురు సోదరీమణులు ఉన్నారు. పదేళ్ల వయసు నుంచే క్రికెట్లో మెళకువలు నేర్చుకున్నాడు సందీప్. మారేడ్ పల్లిలోని సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో లెప్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్, బౌలర్‌గా శిక్షణ తీసుకున్నాడు.
మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ
2010లో రంజీమ్యాచ్ ఆడిన సందీప్ మొదటి మ్యాచ్‌లోనే సెంచరీతో ప్రతిభ చాటాడు. ప్రస్తుతం హైదరాబాద్ రంజీ టీమ్‌కు వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. 54 రంజీమ్యాచ్‌లు ఆడిన సందీప్ 21 అర్ధసెంచరీలు 7 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ సాధించాడు. టీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తిచేసి స్పోర్ట్స్ కోటాలో ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్గా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాడు. నాలుగేళ్లుగా ఉద్యోగంతో పాటు క్రికెట్లో రాణిస్తున్నాడు. ఐపీఎల్ లో ఆడేందుకు పలుమార్లు దరఖాస్తు చేసుకున్న సందీప్‌కు ఎట్టకేలకు 2020లో జరిగే ఐపీఎల్‌కు సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు.