రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రిషభ్ పంత్ (78, 36 బంతుల్లో), శిఖర్ ధావన్ (54) అర్ధ శతకాలతో చెలరేగారు. జైపుర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది రాజస్థాన్. రహానే (105, 63 బంతుల్లో) శతకం వృథా అయింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా రిషభ్ పంత్ ఎంపికయ్యాడు.
192 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలో దిగిన దిల్లీకి శుభారంభం దక్కింది. శిఖర్ ధావన్ - పృథ్వీ షా జోడి తొలి వికెట్‌కు 72 పరుగుల జతచేసింది. 25 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసిన ధావన్ ధాటిగా ఆడే ప్రయత్నంలో శ్రేయస్ గోపాల్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. అనంతరం పంత్ విజృంభించి జట్టును లక్ష్యం దిశగా తీసుకెళ్లాడు. 26 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేశాడు పంత్. మరో పక్క పృథ్వీ షా నిలకడగా ఆడుతూ పంత్‌కు సహకరించాడు. చివర్లో పృథ్వీ షా ఔటైనా.. అనంతరం ఇంగ్రామ్ సాయంతో పంత్ పని పూర్తి చేశాడు.
-
Top of the table ❤
— Delhi Capitals (@DelhiCapitals) April 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
This team ♥
#RRvDC #ThisIsNewDelhi #DelhiCapitals pic.twitter.com/e3RqJRUqSp
">Top of the table ❤
— Delhi Capitals (@DelhiCapitals) April 22, 2019
This team ♥
#RRvDC #ThisIsNewDelhi #DelhiCapitals pic.twitter.com/e3RqJRUqSpTop of the table ❤
— Delhi Capitals (@DelhiCapitals) April 22, 2019
This team ♥
#RRvDC #ThisIsNewDelhi #DelhiCapitals pic.twitter.com/e3RqJRUqSp
పంత్ పరాక్రమం..
12 బంతుల్లో 17 పరుగుల చేయాల్సిన తరుణంలో 19వ ఓవర్ వేసిన జోఫ్రా ఆర్చర్ తొలి ఐదు బంతులకు 5 పరుగులే ఇచ్చాడు. చివరి బంతిని పంత్ సిక్స్ కొట్టి దిల్లీ విజయాన్ని ఖాయం చేశాడు. ఆఖరి ఓవర్లో ఏడు పరుగు అవసరం కాగా తొలి బంతిని సింగిల్ తీశాడు ఇంగ్రామ్, రెండో బంతిని సిక్సర్‌గా మలచి నాలుగు బంతులు మిగులుండగానే దిల్లీకి విజయాన్ని చేకూర్చాడు పంత్.
రహానే శతకం వృథా...
-
Oh yeahhh 🙌🙌
— IndianPremierLeague (@IPL) April 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
What a knock, Ajju 😎 pic.twitter.com/bETLRwqm4H
">Oh yeahhh 🙌🙌
— IndianPremierLeague (@IPL) April 22, 2019
What a knock, Ajju 😎 pic.twitter.com/bETLRwqm4HOh yeahhh 🙌🙌
— IndianPremierLeague (@IPL) April 22, 2019
What a knock, Ajju 😎 pic.twitter.com/bETLRwqm4H
మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టులో రహానే శతకంతో అదరగొట్టగా.. స్మిత్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆరంభంలోనే రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం రహానే - స్మిత్ జోడి నిలకడగా ఆడుతూ స్కోరు వేగం పెంచింది. వీరిద్దరికి ధాటికి స్కోరు 200 దాటుతుందని రాజస్థాన్ అభిమానులు ఆశించారు. కానీ చివర్లో బ్యాట్స్‌మెన్ వేగంగా పరుగులు చేయలేకపోయారు. దిల్లీ బౌలర్లలో రబాడ రెండు వికెట్లు తీయగా, అక్షర్ పటేల్, క్రిస్ మోరిస్, ఇషాంత్ శర్మ తలో ఓ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.