కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. 179 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది దిల్లీ. కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో దిల్లీ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్(97*) అదరగొట్టగా, పంత్ 46 పరుగులతో బాధ్యతయుత ఇన్నింగ్స్ ఆడాడు. కోల్‌కతా బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, రసెల్, నితీశ్ రానా తలో వికెట్ తీసుకున్నారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దిల్లీ జట్టు కోల్‌కతాను 178 పరుగులకు పరిమితం చేసింది. ధాటిగా బ్యాటింగ్ ఆరంభించిన దిల్లీ క్యాపిటల్స్ మూడో ఓవర్లోనే పృథ్వీ షా(14) వికెట్ కోల్పోయింది. అనంతరం కొద్దిసేపటికే కెప్టెన్ శ్రేయాస్(6) రసెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. వీరిద్దరు ఔటైనా... శిఖర్- పంత్ జోడీ మరో వికెట్ పడకుండా ఇన్నింగ్స్‌ని గాడిలో పెట్టింది. ధావన్ 97 పరుగులతో చెలరేగగా... పంత్ 46 పరుగులు చేశాడు. వీరిద్దరు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తర్వాత రిషభ్ ఔటైనా.. ధావన్- ఇంగ్రామ్ మిగతా పని పూర్తి చేశారు. విజయానికి 10 పరుగుల కావాల్సిన తరుణంలో ఇంగ్రామ్ ఫోర్, సిక్సర్‌తో ఇన్మింగ్స్ను ముగించాడు.
ధావన్ సెంచరీ మిస్..
దిల్లీ ఇన్నింగ్స్ ఆరంభం నుంచి శిఖర్ ధావన్ తనదైన శైలిలో దూకుడుగా ఆడాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ.. స్కోరు వేగాన్ని పెంచాడు. 63 బంతుల్లో 97 పరుగులు చేసి నాట్ ఔట్‌గా నిలిచాడు. ఐపీఎల్లో ధావన్ తన తొలి సెంచరీ నమోదు చేస్తాడనే అనుకున్నారు అంతా. ఐతే పంత్ ఔట్ అయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన ఇంగ్రామ్... చివర్లో రెండు బౌండరీలు కొట్టి దిల్లీకి విజయాన్ని అందించడం వల్ల ధావన్ సెంచరీ మిస్ అయ్యింది. ధావన్ 11 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు.
మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(65) అర్ధశతకంతో రాణించాడు. చివర్లో రసెల్(45) మెరుపులతో గౌరవప్రదమైన స్కోరు చేసింది కోల్‌కతా జట్టు. రాబిన్ ఊతప్ప 28 పరుగులతో పర్వాలేదనిపించినా... మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించలేదు. దిల్లీ బౌలర్లలో మోరిస్, రబాడా, కీమో పాల్ తలో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
-
The @DelhiCapitals climb up in the points table after their win today against #KKR pic.twitter.com/ZInil5Tcja
— IndianPremierLeague (@IPL) April 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The @DelhiCapitals climb up in the points table after their win today against #KKR pic.twitter.com/ZInil5Tcja
— IndianPremierLeague (@IPL) April 12, 2019The @DelhiCapitals climb up in the points table after their win today against #KKR pic.twitter.com/ZInil5Tcja
— IndianPremierLeague (@IPL) April 12, 2019