ఐపీఎల్ మజా తెలియాలంటే గురువారం జరిగిన చెన్నై-రాజస్థాన్ తరహా మ్యాచ్‌ను చూడాల్సిందే. చివరి వరకు నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ పోరులో విజయం చెన్నైనే వరించింది. సొంతగడ్డపై గెలవాలకున్న రాజస్థాన్‌కు భంగపాటే ఎదురైంది. ఛేదనలో రాయుడు, ధోని అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. ఈ గెలుపుతో ఐపీఎల్లో వంద విజయాలు అందుకున్న కెప్టెన్‌గా రికార్డు సాధించిన ధోనీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డునూ అందుకున్నాడు.
జైపుర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది చెన్నై. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ధోనీసేనకు శుభారంభం దక్కలేదు. ఖాతా తెరవక ముందే వాట్సన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. మిగతా బ్యాట్స్‌మెన్ రైనా, డుప్లెసిస్, కేదార్ జాదవ్ వెంట వెంటనే వెనుదిరిగారు. 24 పరుగులకే నాలుగు వికెట్లు పోగొట్టుకుని కష్టాల్లో పడింది చెన్నై జట్టు.
ధోనీ-రాయుడు జోడీ..
ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన ధోనీ, రాయుడు వికెట్ల పతనాన్ని అడ్డుకుని నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను నిర్మించారు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఐదో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ క్రమంలో అర్ధ సెంచరీ చేసిన రాయుడు... 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టోక్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
చివరి ఓవర్లో విజయానికి 18 పరుగులు కావాలి. స్టోక్స్ బౌలింగ్. క్రీజులో ఉన్నది ధోనీ. విజయం ఎవరిదా అని అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. ఓవర్ మూడో బంతికి 58 పరుగులు చేసిన ధోనీ ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన శాంట్నర్ చివరి బంతికి సిక్స్ కొట్టి చెన్నైకు విజయాన్ని అందించాడు.
రాజస్థాన బౌలర్లలో స్టోక్స్ రెండు వికెట్లు తీశాడు. ఆర్చర్, ఉనద్కత్, కులకర్ణి తలో వికెట్ పడగొట్టారు.
తడబడ్డ రాజస్థాన్...
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాట్స్మెన్లలో ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఫలితంగా వారు పరుగులు చేసేందుకు కష్టపడాల్సి వచ్చింది.
రహేనే 14, బట్లర్ 23,శాంసన్ 6, స్మిత్ 15, రాహుల్ త్రిపాఠి 10, స్టోక్స్ 28, రియాన్ పరాగ్ 16, జోప్రా ఆర్చర్ 13, శ్రేయస్ గోపాల్ 19 పరుగులే చేశారు.
సీఎస్కే బౌలర్లలో దీపక్ చాహర్, జడేజా, శార్దుల్ తలో రెండు వికెట్లు తీశారు. శాంట్నర్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో స్మిత్‌ను ఔట్ చేసిన జడేజా... ఐపీఎల్లో 100 వికెట్లు తీసిన ఘనత సాధించాడు.
-
A look at the Points Table after Match 25 of #VIVOIPL pic.twitter.com/9Y9udBL8jA
— IndianPremierLeague (@IPL) April 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">A look at the Points Table after Match 25 of #VIVOIPL pic.twitter.com/9Y9udBL8jA
— IndianPremierLeague (@IPL) April 11, 2019A look at the Points Table after Match 25 of #VIVOIPL pic.twitter.com/9Y9udBL8jA
— IndianPremierLeague (@IPL) April 11, 2019