ఐపీఎల్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడుతున్న దిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. విశాఖ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పంత్ (38, 25 బంతుల్లో) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా ఆకట్టుకోలేదు. చెన్నై బౌలర్లలో హర్భజన్, బ్రావో, దీపక్ చాహర్, జడేజా తలో రెండు వికెట్లు తీయగా.. తాహిర్ ఓ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు.
-
Innings Break!@ChennaiIPL restrict #DC to a total of 147/9 https://t.co/9w8Rn4EsOy #CSKvDC pic.twitter.com/qBRhBtFgjZ
— IndianPremierLeague (@IPL) May 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Innings Break!@ChennaiIPL restrict #DC to a total of 147/9 https://t.co/9w8Rn4EsOy #CSKvDC pic.twitter.com/qBRhBtFgjZ
— IndianPremierLeague (@IPL) May 10, 2019Innings Break!@ChennaiIPL restrict #DC to a total of 147/9 https://t.co/9w8Rn4EsOy #CSKvDC pic.twitter.com/qBRhBtFgjZ
— IndianPremierLeague (@IPL) May 10, 2019
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ ఆరంభంలోనే పృథ్వీ షా (5) వికెట్ కోల్పోయింది. మరికాసేపటికే ధావన్ (18) ఔటయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో మన్రో(27) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ చెన్నై బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ దిల్లీ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారు.
చివర్లో పంత్ మెరుపులు మెరిపించాడు. ఓ పక్క బ్యాట్స్‌మెన్ పెవిలియన్ చేరుతున్నా ఆత్మవిశ్వాసంతో ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. 19వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి దీపక్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
-
Holding fort 🤞
— Delhi Capitals (@DelhiCapitals) May 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
What total will @RishabPant777 guide us to in this innings?
#CSKvDC #ThisIsNewDelhi #DelhiCapitals #IPL #IPL2019 pic.twitter.com/5DzqqeET0p
">Holding fort 🤞
— Delhi Capitals (@DelhiCapitals) May 10, 2019
What total will @RishabPant777 guide us to in this innings?
#CSKvDC #ThisIsNewDelhi #DelhiCapitals #IPL #IPL2019 pic.twitter.com/5DzqqeET0pHolding fort 🤞
— Delhi Capitals (@DelhiCapitals) May 10, 2019
What total will @RishabPant777 guide us to in this innings?
#CSKvDC #ThisIsNewDelhi #DelhiCapitals #IPL #IPL2019 pic.twitter.com/5DzqqeET0p
టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై.. బౌలింగ్‌లో సత్తాచాటింది. పదునైన బంతులతో దిల్లీని ఇబ్బంది పెట్టింది. ఓపెనర్ పృథ్వీ షా వికెట్ తీసి ఆరంభంలోనే క్యాపిటల్స్ జట్టును దెబ్బతీశాడు దీపక్ చాహర్. శిఖర్ ధావన్, రూథర్‌ఫర్డ్‌లను పెవిలియన్ చేర్చాడు హర్బజన్ సింగ్. బౌలర్లందరూ సమష్టిగా రాణించడంతో దిల్లీని తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగింది చెన్నై.