ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్ని ఆకర్షిస్తున్న లీగ్‌లలో ఐపీఎల్ అగ్రస్థానంలో ఉంది. ఎందరో మేటి క్రికెటర్లు ఈ టోర్నీ ద్వారా వెలుగులోకి వచ్చారు. ఎప్పటి నుంచో పురుషులకు మాత్రమే కాకుండా మహిళలకు ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించాలనుకుంటోంది బీసీసీఐ. తాజాగా మూడు జట్లను ప్రకటించింది. ఈ జట్లకు మిథాలీ రాజ్, స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.
మూడు జట్లు పేర్లు సూపర్ నోవాస్, ట్రైల్ బ్లేజర్స్, వెలాసిటీ. వీటి మధ్య మే 6 నుంచి 11వ తేదీ వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం దీనికి వేదిక కానుంది. భారతదేశంతో పాటు ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్‌కు చెందిన క్రీడాకారిణిలు పాల్గొంటున్నారు.
సూపర్ నోవాస్: కెప్టెన్-హర్మన్ ప్రీత్ కౌర్, కోచ్- డబ్ల్యూ వీ రామన్
అనూజ పాటిల్, అరుంధతి రాయ్, చమారీ ఆటపట్టు, జెమీమా రోడ్రిగ్స్, లే త్యాహు, మాన్షి జోషి, నటాలియా స్కీవర్, తానియా భాటియా(వికెట్ కీపర్), పూనం యాదవ్, ప్రియా పూనియా, రాధా యాదవ్, సోఫీ డివైన్
ట్రైల్ బ్లేజర్స్: కెప్టెన్- స్మృతి మంధాన, కోచ్- బిజు జార్జ్
భారతి పూల్మాలి, దయాలన్ హేమలత, దీప్తి శర్మ, జులాన్ గోస్వామి, ఆర్.కల్పన (వికెట్ కీపర్), రాజేశ్వరి గైక్వాడ్, షకీరా షెల్మాన్, సోఫీ ఎక్స్‌ల్ స్టోన్, స్టెఫానీ టేలర్, సుజీ బేట్స్
వెలాసిటీ: కెప్టెన్ మిథాలీ రాజ్, కోచ్- మమతా మాబెన్
అమిలియా కెర్, డానియల్ వ్యాట్, దేవికా వైద్య, ఏక్తా బిస్త్, హేలీ మాథ్యుస్, జహనారా ఆలమ్, కోమల్ జంజద్, షఫాలీ వర్మ, శిఖా పాండే, సుష్మ వర్మ( వికెట్ కీపర్), సుశ్రీ దివ్యదర్శిని, వేదా కృష్ణమూర్తి