వచ్చే నెలలో పాకిస్థాన్‌తో జరగనున్న సిరీస్‌కు న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్లు దూరంగా ఉండడంపై పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ స్పందించాడు. ఐపీఎల్ లాంటి ప్రైవేట్ లీగ్ కోసం అంతర్జాతీయ క్రికెట్‌ను విస్మరించడం తగదని అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో ఐసీసీ పాత్రపై ఇంజమామ్ విచారం వ్యక్తం చేశాడు.
"పాకిస్థాన్ జట్టు ఏ దేశంతో మ్యాచ్‌లు ఆడేందుకు వెళ్లినా.. ప్రత్యర్థి జట్టులో ప్రధాన ప్లేయర్లు ఉండడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో దక్షిణాఫ్రికా వెళ్లగా.. వారి జట్టులోని కీలక ఆటగాళ్లను ఐపీఎల్ ఆడేందుకు పంపారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లినా.. కరోనా పేరుతో మెయిన్ ప్లేయర్లను పక్కన పెట్టేశారు. ఇక ఇప్పుడు న్యూజిలాండ్‌తో జరగనున్న సిరీస్‌లోనూ అదే జరగబోతోంది. ఇలా అయితే పాకిస్థాన్ జట్టుకు ప్రాక్టీస్ ఎలా లభిస్తుంది? అయినా అంతర్జాతీయ సిరీస్‌లను కాదని.. ప్రైవేట్ లీగ్స్ ఆడేందుకు ఆటగాళ్లకు అనుమతినిస్తుంటే ఐసీసీ ఏం చేస్తుంది? అదేంటో పాకిస్థాన్‌తో సిరీస్‌లు ఆడే ముందే ఇలాంటివి సంభవించడం ఆశ్చర్యం కలిగిస్తోంది."
- ఇంజమామ్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్
సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకు ఐపీఎల్ 2021 రెండో దశ జరగనుంది. ఈ లీగ్‌లో పాల్గొనేందుకు న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్, ట్రెంట్ బౌల్ట్, కైలీ జెమిసన్, లూకీ ఫెర్గూసన్, జిమ్మి నీషమ్, మిచెల్ శాంటర్న్, టిమ్ సీఫర్ట్ తదితరులు పాకిస్థాన్ పర్యటనకు దూరంగా ఉండనున్నారు. దీంతో పాక్ పర్యటన కోసం టామ్ లాథమ్‌ను కెప్టెన్‌గా నియమించింది కివీస్ జట్టు యాజమాన్యం. అయితే ఇటీవలే ప్రకటించిన కివీస్ టీ20 ప్రపంచకప్ జట్టులో టామ్ లాథమ్‌కు అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం.
ఇదీ చూడండి.. లార్డ్స్ టెస్టుకు శార్దూల్ దూరం.. అశ్విన్‌కు చోటు!