ETV Bharat / sports

IND vs ENG: ఇంగ్లాండ్‌ ఓపెనర్ల శుభారంభం.. ఆసక్తిగా ఐదోరోజు ఆట

ఓవల్​లో జరుగుతున్న నాలుగో టెస్ట్​ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్​77/0 పరుగులు చేసింది. విజయానికి ఆ జట్టు మరో 291 పరుగులు దూరంలో ఉంది. దీంతో ఐదో రోజు కీలకంగా మారనుంది.

IND vs ENG
ఇండియా, ఇంగ్లాండ్​
author img

By

Published : Sep 5, 2021, 11:37 PM IST

Updated : Sep 5, 2021, 11:45 PM IST

ఓవల్​ వేదికగా సాగుతున్న నాలుగో టెస్ట్​ రసవత్తరంగా మారింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్​ 77/0 పరుగులు చేసింది. ఐదో రోజు మ్యాచ్​ గెలవాలంటే రూట్​ సేన మరో 291 పరుగులు చేయాల్సి ఉంది.

ప్రస్తుతం క్రీజులో బర్న్స్​ (31), హమీద్​ (43) ఉన్నారు. భారత్​ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్​ చేస్తున్నా.. పిచ్​ బ్యాటింగ్​కు సహకరిస్తుండటం వల్ల ఇంగ్లీష్​ బ్యాట్స్​మెన్​ పరుగులు రాబట్టగలుగుతున్నారు.

మొత్తం మ్యాచ్​లో ఐదో రోజు తొలి సెషన్​ అత్యంత కీలకంగా మారనుంది. త్వరగా వికెట్లు తీస్తే, మ్యాచ్​ గెలుపుపై భారత అభిమానులు ఆశలు పెట్టుకోవచ్చు. అటు వికెట్లు పోకుండా, నిలకడగా ఆడితే ఇంగ్లాండ్​కు మ్యాచ్​ దక్కే అవకాశమూ లేకపోలేదు.

రోహిత్​- పుజారాలకు గాయాలు...

ఇంగ్లాండ్​ రెండో ఇన్నింగ్స్​లో రోహిత్​ శర్మ, పుజారా మైదానంలోకి దిగలేదు. భారత్​ బ్యాటింగ్​ సందర్భంగా వీరికి గాయాలైనట్టు, అందుకే మైదానంలోకి అడుగుపెట్టనట్టు తెలుస్తోంది. అయితే వీరి గాయాల తీవ్రత, ఐదో రోజు ఆడతారా లేదా అన్న విషయంపై స్పష్టత లేదు.

అంతకుముందు.. భారత్​ 466పరుగులకు ఆలౌట్​ అయ్యింది. నాలుగో రోజు ఆట భారత్​ జడేజా, రహానే, కోహ్లీ వికెట్లను తొలి సెషన్​లోనే కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్(50)​, శార్దుల్(60)​ జట్టును ఆదుకున్నారు. ధనాధన్​ ఇన్నింగ్స్​లతో జట్టుకు విలువైన భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత వచ్చిన ఉమేశ్​, బుమ్రా.. చివర్లో వేగంగా పరుగులు సాధించి జట్టు స్కోరను 450 దాటించారు.

ఇదీ చూడండి: Rohit Sharma: 'నా జీవితంలో అదే అతిపెద్ద నిర్ణయం'

Last Updated : Sep 5, 2021, 11:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.