ఈసారి జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో(ICC T20 World Cup 2021) ఆస్ట్రేలియా జట్టు గెలిచే అవకాశాలెక్కువ ఉన్నాయని వెటరన్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అంటున్నాడు. ఐసీసీ మెగా టోర్నీకి ఐపీఎల్ ఆడడం వల్ల ఆసీస్ క్రికెటర్లకు(Australian Cricketers in IPL 2021) ఎంతో మేలు చేస్తుందని తెలిపాడు. ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లలో ఆస్ట్రేలియా జట్టు పేలవ ప్రదర్శన చేసినా.. టీ20 ప్రపంచకప్‌లో ఉత్తమంగా రాణిస్తారని ధీమా వ్యక్తం చేశాడు.
"మా(ఆస్ట్రేలియా) జట్టు లైనప్ ఎంతో బలంగా ఉంది. మ్యాచ్‌ను సునాయాసంగా గెలిపించగలిగే విజేతలు చాలా మందే ఉన్నారు. మాకంటూ ఒకరోజు వస్తుంది. అప్పుడు ఏ టీమ్ అయినా మా ప్రదర్శనతో పైచేయి సాధిస్తాం. ఆ సమయంలో మమ్మల్ని ఆపటం ఎవరికీ సాధ్యం కాదు".
- గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్
టీ20 ప్రపంచకప్‌కు ముందు ఐపీఎల్ ఆడడం తమ జట్టుకు కలిసొచ్చే అంశమని మ్యాక్స్‌వెల్ అంటున్నాడు. అయితే ప్రస్తుతం ఏ జట్టు బలహీనమైనది కాదని.. కష్టపడి ఆడితే ఎవరైనా విజయం సాధించొచ్చని తెలిపాడు.
ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ స్క్వాడ్: ఆరోన్ ఫించ్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, జోష్ హజల్‌వుడ్, మిచెల్ స్టార్క్, మాథ్యూ వేడ్, ఆస్టన్ అగర్, జోష్ ఇంగ్లీష్, కేన్ రిచర్డ్‌సన్, పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్, స్వీప్సన్, ఆడమ్ జంపా.
రిజర్వు ప్లేయర్లు: డానియల్ క్రిస్టియన్, నాథన్ ఎల్లిస్, డానియల్ సామ్స్.
ఇదీ చూడండి.. IPL 2021: గుడ్‌న్యూస్.. ఐపీఎల్లో ప్రేక్షకులకు అనుమతి