ఇంగ్లాండ్ సిరీస్‌కు (Ind vs Eng series 2021) ముందు గాయాలు టీమ్ఇండియాను ఆందోళనలో పడేశాయి. నడుము నొప్పితో సారథి విరాట్ కోహ్లీ(Kohli Injury), తొడవాపుతో వైస్ కెప్టెన్ అజింక్య రహానె ఇప్పటికే మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌కు దూరమయ్యారు. రోహిత్ శర్మ నేతృత్వంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. దీంతో తొలి టెస్ట్ నాటికి వీరు కోలుకుంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ గాయాలు పెద్ద సమస్య కాదని.. ఆగస్టు 4న ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌కు వీరు అందుబాటులో ఉంటారని తెలిసింది. ప్రస్తుతం వీరిద్దరిని బోర్డు వైద్య పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు బీసీసీఐ సెక్రటరీ జైషా. తొలి టెస్ట్ సమయానికి కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా.. కౌంటీ సెలక్ట్ ఎలెవన్ తరఫున ఆడిన ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్ ఎడమ చేతి బొటనవేలుకు గాయమైంది. అతడి పరిస్థితి తెలియాల్సి ఉంది. ఇంగ్లాండ్- టీమ్ఇండియా మధ్య.. ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 వరకు 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది.
రాహుల్ సెంచరీ..
కౌంటీ సెలక్ట్ ఎలెవన్‌తో మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌ను(Warm up match) తడబడుతూ ఆరంభించిన భారత్.. తర్వాత పుంజుకుంది. చాన్నాళ్లుగా టెస్టు తుది జట్టుకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ (KL Rahul) (101 నాటౌట్; 150 బంతుల్లో 11×4, 1×6) చక్కటి శతకంతో భారత్‌ను ఆదుకుని సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. అతడితో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (75; 146 బంతుల్లో 5×4, 1×6) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆట ఆఖరుకు భారత్ 9 వికెట్లకు 306 పరుగులు చేసింది.
ఇదీ చూడండి: రాహుల్ శతకం.. రాణించిన జడేజా