ETV Bharat / sports

ఆసీస్​తో టీమ్ఇండియా ఢీ.. గెలవాలంటే ఇవి మెరుగుపడాలి!

INDw Vs AUSw : మహిళల టీ20 వరల్డ్​ కప్ నాకౌట్ దశకు చేరింది. టైటిల్​ రేసులో నిలిచిన పది జట్లులో.. నాలుగు టీమ్​లు సెమీ ఫైనల్​కు చేరాయి. కామన్​వెల్త్​ గేమ్స్​లో​ ఆసీస్​ చేతిలో ఓటమిపాలైన టీమ్ఇండియా.. ఈసారి గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. కానీ ఆసీస్​ లాంటి బలమైన జట్టుపై గెలవాలంటే.. భారత​ ప్లేయర్లు ఇవి మెరుగుపర్చుకోవాల్సిందే.

indw vs ausw womens t20 world cup 2023
indw vs ausw womens t20 world cup 2023
author img

By

Published : Feb 23, 2023, 7:25 AM IST

INDw Vs AUSw : మహిళల టీ20 వరల్డ్​ కప్​ నాకౌట్​లోకి అడుగుపెట్టింది. మొత్తం పది జట్లు టైటిల్​ రేసులో నిలిచాయి. అందులో నుంచి నాలుగు జట్లు సెమీ ఫైనల్​కు చేరాయి. గ్రూప్​-ఏ నుంచి సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా.. గ్రూప్​-బీ నుంచి ఇంగ్లాండ్​, భారత్​ వెళ్లాయి. ఇక సెమీస్​లో బరిలో ఆస్ట్రేలియాతో టీమ్​ఇండియా.. సౌతాఫ్రికాతో ఇంగ్లాండ్ తలపడనున్నాయి.
కాగా, కామన్​వెల్త్​ గేమ్స్​లో ఆసీస్​ చేతిలో ఓటమి చవిచూసిన భారత్.. ఈసారి ఎలాగైనా గెలిచి కంగారూలపై ప్రతీకారం తీసుకునేందుకు ఉత్సాహంగా ఉంది. కానీ అది అంత సులువు కాదు. ఎందుకంటే.. గ్రూప్​ స్టేజ్​లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్​లు ఆడిన ఆసీస్​ అన్నింటిలోనూ ఘన విజయం సాధించింది. కివీస్​పై 97 పరుగుల తేడాతో సూపర్​ విక్టరీ సాధించింది. ఇక, శ్రీలంకపై పది వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్​లో శ్రీలంక ఇచ్చిన 113 పరుగుల టార్గెట్​ను వికెట్లు కోల్పోకుండా 16 ఓవర్లలోనే ఛేదించింది. మరోవైపు ఆసీస్​ జట్టు కూడా చాలా బలంగా ఉంది. అత్యధిక పరుగులు సాధించిన మూడో ప్లేయర్​గా ఆ జట్టు బ్యాటర్​ అలీసా హీలే నిలిచింది. ఇక బౌలింగ్​ విషయంలో గార్డనర్​ సూపర్​ ఫామ్​లో ఉంది. ఈ ప్లేయర్​తో పాటు.. బెత్‌ మూనీ, కెప్టెన్ మెగ్‌ లానింగ్‌, ఆష్లే గార్డెనర్‌, ఎల్సే పెర్రీ, తహిలా మెక్‌గ్రాత్‌ వంటి టాప్‌ ప్లేయర్లతో ఆసీస్​ జట్టు బలంగా ఉంది.

ఇక టీమ్ఇండియాకు ఆసీస్​పై అంత గొప్ప రికార్డు లేదు. ఇప్పటి వరకు 30 టీ20ల్లో ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా తలపడింది. అందులో కేవలం 7 మ్యాచ్​ల్లో మాత్రమే భారత్​ గెలిచింది. 22 మ్యాచ్​ల్లో ఆసీస్​ విజయం సాధించింది. ఇక ఒక మ్యాచ్​ డ్రాగా ముగిసింది. గత ఐదు మ్యాచ్​ల్లో ఒక్క దాంట్లో మాత్రమే టీమ్​ఇండియా గెలుపొందింది. దీనికి తోడు స్మృతీ మంధాన, హర్మన్ ప్రీత్​ కౌర్, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ లాంటి ప్లేయర్లు కీలక సమయాల్లో హ్యాండ్​ ఇవ్వడం ఆందోళన కలిగించే విషయం.

అయితే, గురువారం(ఫిబ్రవరి 23) జరిగే మ్యాచ్​లో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ జట్టుకు మంచి స్టార్ట్​ను అందించాలి. వీలు వీలైనంత ఎక్కువ సమయం క్రీజులో ఉండేలా చూసుకోవాలి. ఇక బ్యాటింగ్​లో విఫలమవుతున్న స్టార్​ బ్యాటర్​ దీప్తి శర్మ రాణించాలి. అలా దాదాపు 170 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్​కు నిర్దేశించాలి. అప్పుడే కంగారూలను కట్టిడి చేసే అవకాశం ఉంటుంది.

మ్యాచ్​ ఇందులో చూడొచ్చు..
స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానెల్స్‌, డీస్నీ+ హాట్‌స్టార్‌(ఓటీటీ)

తుది జట్లు (అంచనాలు):
భారత జట్టు: హర్మన్‌ ప్రీత్‌ కౌర్ (కెప్టెన్), స్మృతీ మంధాన, షఫాలీ వర్మ, రిచా ఘోష్‌, జెమీమా రోడ్రిగ్స్‌, దీప్తి శర్మ, రాధా యాదవ్‌, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే, రేణుకా సింగ్‌
ఆస్ట్రేలియా జట్టు: మెగ్ లానింగ్‌ (కెప్టెన్), బెత్ మూనీ, ఎలీసా హీలే, ఆష్లే గార్డెనర్, ఎలీస్ పెర్రీ, తహిలా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్‌, జార్షియా వారెహమ్, అలానా కింగ్‌, మెగన్ స్కట్, డార్సీ బ్రౌన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.