భారత మహిళల క్రికెట్ జట్టులో ఓ కొత్త కెరటానికి అవకాశం దక్కింది. దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని వారసత్వాన్ని కొనసాగిస్తూ ఝార్కండ్‌కు చెందిన వికెట్ కీపర్, బ్యాటర్ ఇంద్రాణి రాయ్ తొలిసారి భారత మహిళల జట్టులో చోటు దక్కించుకుంది. వచ్చే నెలలో ఏకైక టెస్టుతో పాటు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. నీతు డేవిడ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శుక్రవారం వివిధ ఫార్మాట్లకు జట్లను ప్రకటించింది. ఈ మూడు జట్లకూ ఇంద్రాణి ఎంపికైంది. దక్షిణాఫ్రికాతో వన్డే, టీ20 సిరీస్‌లకు పక్కన పెట్టిన సీనియర్ ఫాస్ట్ బౌలర్ శిఖా పాండేతో పాటు.. సఫారీలతో వన్డేలకు ఎంపిక కాని డాషింగ్ ఓపెనర్ షెఫాలి వర్మకు సైతం అన్ని జట్లలోనూ చోటిచ్చారు. గాయం కారణంగా సీనియర్ స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ ఈ పర్యటనకు దూరమైంది. టెస్టు, వన్డే మ్యాచ్‌ల్లో భారత జట్టుకు మిథాలీ రాజ్ సారథ్యం వహించనుండగా.. టీ20ల్లో హర్మన్‌ప్రీత్ జట్టును నడిపించనుంది.
టెస్టు, వన్డే జట్టు:
మిథాలీరాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధాన, పూనమ్ రౌత్, ప్రియ పునియా, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, షెఫాలి వర్మ, స్నేహ రాణా, తానియా భాటియా (వికెట్ కీపర్), ఇంద్రాణి రాయ్ (వికెట్ కీపర్), జులన్ గోస్వామి, శిఖా పాండే, పూజ వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్ఠ్, రాధ యాదవ్.
టీ20 జట్టు:
హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి (వైస్ కెప్టెన్), దీప్తి, జెమీమా, షెఫాలి, రిచా ఘోష్, హర్లీన్ డియోల్, స్నేహ్ రాణా, తానియా, ఇంద్రాణి, శిఖా పాండే, పూజ, అరుంధతి, పూనమ్, ఏక్తా, రాధ, సిమ్రన్ దిల్ బహదూర్.
ఇదీ చదవండి: ఇటాలియన్ ఓపెన్ సెమీస్‌లో నాదల్