ETV Bharat / sports

'ధ్యాస మళ్లించడంలో టీమ్​ఇండియా దిట్ట'

ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల ధ్యాస మళ్లించడంలో టీమ్​ఇండియా దిట్ట అని ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ అభిప్రాయపడ్డాడు. యాషెస్ టెస్టు అనంతరం కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు పరోక్షంగా చెప్పాడు.

australia captain
టిమ్ పైన్,ఆస్ట్రేలియా కెప్టెన్
author img

By

Published : May 13, 2021, 2:09 PM IST

టీమ్​ఇండియాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ టిమ్ పైన్. ప్రత్యర్థి జట్టు ధ్యాస మళ్లించడంలో భారత ఆటగాళ్లు దిట్ట అని అన్నాడు. ఆసీస్ గడ్డపై భారత్​ సిరీస్​ నెగ్గడంపై ఈ విధంగా మాట్లాడాడు టిమ్ పైన్.

"టీమ్​ఇండియాతో ఆడటం ఛాలెంజింగ్​గా ఉంటుంది. ఇతర ఆటగాళ్ల ధ్యాస మళ్లించడంలో భారత ఆటగాళ్లు అనుభవజ్ఞులు. బోర్డర్ గావస్కర్​ ట్రోఫీలోనూ భారత్​ ఇలాంటి ప్రయత్నాలు చేసి ఆసీస్ ఆటగాళ్ల దృష్టిని మరల్చింది. కీలక ఆటగాళ్లు లేకపోయినా సిరీస్​ నెగ్గింది."

--టిమ్​ పైన్, ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్.

కెప్టెన్సీకి టాటా!

యాషెస్​ టెస్టులో ఇంగ్లాండ్​పై విజయం సాధిస్తే టెస్టు కెప్టెన్సీ వదులుకుంటా అని పరోక్షంగా చెప్పాడు టిమ్ పైన్. తన స్థానంలో స్టీవ్​ స్మిత్​ను తిరిగి కెప్టెన్​ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. స్మిత్​ సమర్థమైన కెప్టెన్​గా రాణించగలడని ధీమా వ్యక్తం చేశాడు.

గతంలో బాల్​ టాంపరింగ్​ ఆరోపణల కారణంగా స్మిత్​ కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు.

ఇదీ చదవండి:'భారత జట్టు భావి సారథి అతడే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.