ETV Bharat / sports

India T20 WC squad: టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ జట్టు ఇదేనా? - టీ20 ప్రపంచ కప్ప్​ 2021

టీ20 ప్రపంచకప్​ జట్టు(India T20 WC Team) ను బీసీసీఐ సెలక్టర్ల బృందం (BCCI selection committee) ఇప్పటికే ఎంపిక చేసిందని సమాచారం. ఈ విషయమై ఎంపిక కమిటీ నాలుగో టెస్టుకు ముందే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రితో సమావేశమైందని తెలుస్తోంది. ఇంగ్లాండ్​తో జరుగుతోన్న నాలుగో టెస్టు​ ఫలితం తర్వాత జట్టును ప్రకటించనుందట బోర్డు.

India T20 WC Team
టీమ్‌ఇండియా టీ20 ప్రపంచకప్‌ జట్టు
author img

By

Published : Sep 6, 2021, 1:22 PM IST

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ జట్టు(India T20 WC Team)ను బీసీసీఐ సెలక్టర్ల బృందం (BCCI selection committee) ఎంపిక చేసిందని సమాచారం. బహుశా సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయం జట్టును ప్రకటిస్తారని తెలిసింది. చేతన్‌ శర్మ నేతృత్వంలోని ఎంపిక కమిటీ నాలుగో టెస్టుకు ముందే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రితో సమావేశమైందట. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కొందరి స్థానాల గురించి చర్చించారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

నాలుగో టెస్టు​ ఫలితం తర్వాతే..

ఇప్పటికే జట్టు ఎంపిక పూర్తైందని తెలిసింది. నాలుగో టెస్టు ఫలితం త్వరగా తేలితే సోమవారం సాయంత్రమే జట్టును ప్రకటిస్తారు. ఆలస్యమైతే మంగళవారం ఉదయం ప్రకటిస్తారని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. ఎవరెవరిని ఎంపిక చేయాలి? ఏ స్థానాల్లో ఎవరిని ఆడించాలన్న అంశాలపై నాలుగో టెస్టుకు ముందే కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో చేతన్‌ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ వర్చువల్‌గా సమావేశమైంది.

ఐసీసీ 15 మందికే రీయింబర్స్‌ చేస్తున్నా బీసీసీఐ మాత్రం అదనంగా మరో ఐదుగురిని ఎంపిక చేయనుంది. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో ముందు జాగ్రత్త పడుతోంది. ఐపీఎల్‌ బుడగ నుంచి ప్రపంచకప్‌ బుడగకు వీరంతా బదిలీ అవుతారు. ఇంగ్లాండ్‌, శ్రీలంక పర్యటనలకూ బీసీసీఐ జంబో జట్లనే ఎంపిక చేసింది.

అక్టోబర్‌ 17 నుంచి ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ (t20 world cup 2021 schedule) ఆరంభమవుతోంది. తొలుత గ్రూప్‌-ఎ, గ్రూప్‌-బిలోని జట్లు తలపడతాయి. ప్రతి గ్రూపులో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సూపర్‌-12కి అర్హత సాధిస్తాయి. అక్టోబర్‌ 23 నుంచి ప్రధాన మ్యాచులు మొదలవుతాయి. ఈ మెగా టోర్నీకి బీసీసీఐ ఆతిథ్యమిస్తున్నా.. కరోనా వల్ల యూఏఈ, ఒమన్‌ను వేదికలుగా ఎంపిక చేశారు. అంతకన్నా ముందు యూఏఈలో ఐపీఎల్‌ జరిగనుంది.

ఆ జట్టు ఇదేనా?

కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్ పంత్‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమి, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, యుజ్వేంద్ర చాహల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, శిఖర్‌ ధావన్‌ ప్రపంచకప్‌ ప్రధాన జట్టులో (t20 world cup 2021 india squad players list ) ఉండే అవకాశం ఉంది.

ఎవరైనా గాయపడితే రిజర్వుగా వాషింగ్టన్‌ సుందర్‌, వరుణ్‌ చక్రవర్తి, పృథ్వీ షా, దీపక్‌ చాహర్‌, ప్రసిద్ధ్‌ కృష్ణను ఎంపిక చేస్తారని సమాచారం.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.