ETV Bharat / sports

టీమ్​ఇండియా మిడిల్​ ఆర్డర్​లో కొత్త శకం - టీమ్​ ఇండియా మిడిల్​ ఆర్డర్​

Indian Team Middle Order: రోహిత్​ శర్మ సారథ్యంలో భారత జట్టు తొలి టెస్టు ఆడనుంది. ఈ టెస్టుతోనే టీమ్​ఇండియా మిడిల్​ ఆర్డర్​లో నూతన శకానికి నాంది పలకనుంది. ఛెతేశ్వర్​ పుజారా, అజింక్యా రహానెను పక్కన పెట్టిన భారత జట్టు.. మిడిల్​ ఆర్డర్​లో శుభ్​మన్​ గిల్​, హనుమ విహారి, రిషబ్​ పంత్​ను వ్యూహాత్మకంగా ఉపయోగించుకోనుంది.

Team Combination
Team Combination
author img

By

Published : Feb 28, 2022, 6:19 PM IST

Indian Team Middle Order: కెప్టెన్​గా రోహిత్ శర్మ తొలి టెస్టుతో.. టీమ్​ఇండియా మిడిల్​ ఆర్డర్​లో కూడా కొత్త శకం ఆరంభం కానుంది. ఛెతేశ్వర్​ పుజారా, అజింక్యా రహానెకు దీర్ఘకాల ప్రత్యామ్నాయంగా శుభ్​మన్​ గిల్, హనుమ విహారి సిద్ధంగా ఉండటమే అందుకు కారణం. ఈ సీజన్​లో (శ్రీలంకతో 2, ఇంగ్లాండ్​లో ఒకటి) రహానె, పుజారాలకు జట్టులో స్థానం దక్కలేదు. ఈ క్రమంలోనే దశాబ్దకాలం వారు సొంతం చేసుకున్న స్థానాలను భర్తీ చేసేందుకు గిల్, విహారి సహా శ్రేయస్​ అయ్యర్​ సంసిద్ధమయ్యారు.

అయితే మార్చి 4న ప్రారంభంకానున్న తొలి టెస్టులో ముగ్గురిలో ఎవరిని పక్కనపెడతారనే విషయం ఆసక్తిగా మారింది. మొహాలీలో జరగనున్న ఈ మ్యాచ్​ మాజీ సారథి విరాట్​ కోహ్లీకి 100వది కావడం విశేషం.

Team Combination
గిల్​-విరాట్ కోహ్లీ

శుభ్​మన్​ గిల్​కు ఉన్న ఉత్సాహం, పరిస్థితులకు తగినట్లుగా గేర్​ మార్చి ఆడే స్వభావం రీత్యా అతడిని హెడ్​ కోచ్​ రాహుల్​ ద్రవిడ్.. మిడిల్​ ఆర్డర్​ బ్యాటర్​గా ఉపయోగించుకునే అవకాశం ఉంది. రోహిత్​, మయాంక్ అగర్వాల్ తర్వాత అతడు నెం.3లో రావొచ్చు.

Team Combination
విహారి

రహానె నెం.5లో ఆడేవాడు. కానీ విహారిని 6వ స్థానంలో ఆడించి, వేరియేషన్​ కోసం ప్రమాదకర బ్యాటర్​ రిషభ్​ పంత్​ను 5లో దించే అవకాశం ఉంది. "మయాంక్, రోహిత్, గిల్, విరాట్​ అందరూ రైట్​హ్యాండ్​ బ్యాటర్లు. లెఫ్ట్​-రైట్​ కాంబినేషన్​ కోసం నెం.5లో లెఫ్ట్​ హ్యాండర్​ ఉంటే మేలు. ఆ తర్వాత విహారి వస్తే.. 7లో మళ్లీ లెఫ్ట్​ హ్యాండర్ రవీంద్ర జడేజా వస్తాడు. ఈ పద్ధతిలో వెళ్లేందుకు ఆస్కారం ఉంది." అని ఓ మాజీ సెలక్టర్​ వివరించారు.

ఇక అరంగేట్రంలోనే సెంచరీతో అదరగొట్టిన శ్రేయస్​ తుది జట్టులో స్థానం కోసం మరి కొంతకాలం వేచిచూడాల్సి రావొచ్చు. అయితే ఎవరైనా ఫిట్​గా లేరని తేలితే వరుసలో మొదట ఉండేది అతడే!

టీమ్​ఇండియా తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, శుభ్​మన్​ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్​ పంత్ (వికెట్ కీపర్), హనుమ విహారి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్​ (ఫిట్​నెస్​)/ జయంత్ యాదవ్, జస్ప్రీత్​ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

ఇదీ చూడండి: Team India: 3 సిరీస్‌లు గెలిచినా.. వీటికి సమాధానమేది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.