ETV Bharat / sports

డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం మన వాళ్లు ముందే! - టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ భారత్

కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదాపడింది. దీంతో ఇంగ్లాండ్​ వేదికగా జూన్​లో జరగబోయే టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం అనుకున్నదానికంటే ముందుగానే భారత్ జట్టు బయల్దేరివెళ్లనుందట. మే నెలాఖర్లో ఐపీఎల్‌ పూర్తి చేసుకుని జూన్‌ మొదటి వారంలో ఇంగ్లాండ్‌కు బయల్దేరాలన్నది ముందున్న ప్రణాళిక

WTC Finale
డబ్ల్యూటీసీ ఫైనల్
author img

By

Published : May 6, 2021, 6:25 AM IST

కరోనా కారణంగా ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌ వేదికగా జరగబోయే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం మొదట అనుకున్న దాని కంటే కాస్త ముందుగానే భారత ఆటగాళ్లు స్వదేశం నుంచి బయల్దేరనున్నట్లు సమాచారం. మే నెలాఖర్లో ఐపీఎల్‌ పూర్తి చేసుకుని జూన్‌ మొదటి వారంలో ఇంగ్లాండ్‌కు బయల్దేరాలన్నది ముందున్న ప్రణాళిక.

అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఐపీఎల్‌ వాయిదా పడింది. భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు ఇంగ్లాండ్‌ ఆంక్షలు విధిస్తోంది. కనీసం పది రోజులు క్వారంటైన్‌ తప్పనిసరి చేస్తోంది. మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఈ నేపథ్యంలో మే నెలాఖర్లోనే ఇంగ్లాండ్‌కు భారత జట్టు బయల్దేరి వెళ్లడం ద్వారా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

డబ్ల్యూటీసీ ఫైనల్‌ ప్రాధాన్యం దృష్ట్యా కాస్త ముందే వెళ్లి అక్కడి పరిస్థితులకు అలవాటు పడటం, వీలైనంత ఎక్కువగా సాధన చేయడం అవసరమని కూడా భారత జట్టు యాజమాన్యం యోచిస్తోంది. ఈ మ్యాచ్‌ అయ్యాక భారత జట్టు ఇంగ్లాండ్‌లోనే ఉంటుంది. ఆగస్టు-సెప్టెంబరు మధ్య ఇంగ్లాండ్‌తో భారత్‌ అయిదు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.