ETV Bharat / sports

రంజీ ట్రోఫీ 2022.. రెండేళ్ల తర్వాత మళ్లీ షురూ

author img

By

Published : Feb 17, 2022, 5:30 AM IST

దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. 38 జట్లతో మొదటి రౌండు మ్యాచ్​లు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ, క్రికెటర్ల కోసం అన్ని జాగ్రత్తలు భారత క్రికెట్ బోర్డు అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.

Ranji Trophy 2022
రంజీ ట్రోఫీ

కరోనా కారణంగా దాదాపు రెండేళ్ల పాటు నిలిచిపోయిన రంజీ ట్రోఫీ మళ్లీ మొదలైంది. దేశవాళీ ఆటగాళ్లు సత్తా చాటుకునే ఈ ట్రోఫీ గురువారమే ప్రారంభమవనుంది. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ, బీసీసీఐ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. 38 జట్లతో బయో సెక్యులర్ వాతావరణంలో మ్యాచ్​ల్ని నిర్వహించనున్నారు. ట్రోఫీలో పాల్గొనే ఆటగాళ్ల కోసం దేశవ్యాప్తంగా ఎనిమిది చోట్ల బయో బబుల్స్ ఏర్పాటు చేశారు.

ఈ దేశవాళీ ఆటల్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ సౌరాష్ట్ర, 41 సార్లు ఛాంపియన్​గా నిలిచిన ముంబయి మధ్య పోరుపైనే ఆసక్తి నెలకొంది. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్​లో విఫలమైన రహానె, పుజారాలు ఈ జట్ల తరపున బరిలో దిగనున్నారు. ఈ మ్యాచ్​ల్లో ఎక్కువ పరుగులు చేసి శ్రీలంకతో త్వరలో జరిగే టెస్టు సిరీస్​ కోసం జాతీయ జట్టులో స్థానం దక్కించుకోవాలని చూస్తున్నారు.

మొదటి రౌండ్​ మ్యాచ్​లు:

  • కర్ణాటక vs రైల్వేస్, ఎలైట్ గ్రూప్ సి (చెన్నై).
  • హైదరాబాద్ vs చండీగఢ్, ఎలైట్ గ్రూప్ బి (భువనేశ్వర్)
  • బంగాల్ vs బరోడా, ఎలైట్ గ్రూప్ బి (కటక్)
  • కేరళ vs మేఘాలయ, ఎలైట్ గ్రూప్ ఏ (రాజ్‌కోట్)
  • గుజరాత్ vs మధ్యప్రదేశ్, ఎలైట్ గ్రూప్ ఏ (రాజ్‌కోట్)
  • మణిపూర్ vs అరుణాచల్ ప్రదేశ్, ప్లేట్ (కోల్‌కతా)
  • జమ్మూ కశ్మీర్ vs పుదుచ్ఛేరి, ఎలైట్ గ్రూప్ సి (చెన్నై)
  • సౌరాష్ట్ర vs ముంబయి, ఎలైట్ గ్రూప్ డి (అహ్మదాబాద్)
  • ఒడిశా vs గోవా, ఎలైట్ గ్రూప్ డి (అహ్మదాబాద్)
  • నాగాలాండ్ vs సిక్కిం, ప్లేట్ (కోల్‌కతా)
  • బిహార్ vs మిజోరం, ప్లేట్ (కోల్‌కతా)
  • ఝార్ఖండ్ vs ఛత్తీస్‌గఢ్, ఎలైట్ గ్రూప్ హెచ్ (గౌహతి)
  • దిల్లీ vs తమిళనాడు, ఎలైట్ గ్రూప్ హెచ్ (గువహటి)
  • మహారాష్ట్ర vs అసోం, ఎలైట్ గ్రూప్ జి (రోహ్తక్)
  • విదర్భ vs ఉత్తర ప్రదేశ్, ఎలైట్ గ్రూప్ జి (గురుగ్రామ్)
  • హరియాణా vs త్రిపుర, ఎలైట్ గ్రూప్ ఎఫ్ (దిల్లీ)
  • పంజాబ్ vs హిమాచల్ ప్రదేశ్, ఎలైట్ గ్రూప్ ఎఫ్ (దిల్లీ)
  • సర్వీసెస్ vs ఉత్తరాఖండ్, ఎలైట్ గ్రూప్ ఈ (తిరువనంతపురం)
  • ఆంధ్ర vs రాజస్థాన్, ఎలైట్ గ్రూప్ ఈ (తిరువనంతపురం)

ఇదీ చదవండి: IPL 2022 KKR: కోల్​కతా కెప్టెన్​గా శ్రేయస్​ అయ్యర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.