ETV Bharat / sports

బాలీవుడ్​ తారలను పెళ్లాడిన టీమ్ఇండియా క్రికెటర్లు! - cricket

హీరో హీరోయిన్ల మధ్య కంటే.. క్రికెటర్స్, కథానాయికల మధ్యే ఎఫైర్స్ ఎక్కువగా సాగుతుంటాయి! ఇప్పటివరకు ఎందరో ముద్దుగుమ్మలు.. క్రికెటర్లతో ప్రేమలో మునిగితేలి వార్తల్లో నిలిచారు. కొన్ని ప్రేమలు పెళ్లికి దారితీయగా.. మరికొన్ని మధ్యలోనే అర్ధాంతరంగా ముగిసిపోయాయి. అందులో ఎవరెవరిని ప్రేమించారు? వారిలో పెళ్లిపీటలెక్కిన వారెందరు?

Indian cricketers who married Bollywood actresses
బాలీవుడ్​ తారలను పెళ్లాడిన టీమ్ఇండియా క్రికెటర్లు
author img

By

Published : Sep 16, 2021, 5:10 PM IST

సినిమా, క్రికెట్.. ఈ రెండు రంగాలది విడదీయరాని బంధం. ఈ రెండింటికి ప్రేక్షకుల్లో విశేష ఆదరణ ఉంది. అందుకే వీటికి సంబంధించి ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. ఇక క్రికెటర్స్​ -హీరోయిన్స్ మధ్య ఎఫైర్ ఉంటే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీరి మ‌ధ్య ప్రేమాయ‌ణం ఈనాటిది కాదు.. నాటి ఇమ్రాన్​ ఖాన్​- దీవా జీనత్​, కపిల్​దేవ్​-సారికా నుంచి నేటి విరాట్ కోహ్లీ-అనుష్క‌శ‌ర్మ వరకు ఎంద‌రో క్రికెట‌ర్లు-హీరోయిన్ల‌ మధ్య ప్రేమకథలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. కానీ ఇందులో చాలా వరకు మధ్యలోనే బ్రేకప్ అవ్వడం.. కొన్ని అవి నిజం కాదని తేలడం, మరికొన్ని పెళ్లి పీటలు వరకు వెళ్లడం జరిగాయి. అయితే ప్రేమలో విజయవంతమయ్యి పెళ్లి చేసుకున్న జంటలు ఎన్నో తెలుసా?

బాలీవుడ్​ హీరోయిన్లను పెళ్లాడిన క్రికెటర్లు ఎవరంటే?

1) మన్​సూర్​ అలీఖాన్ పటౌడీ, షర్మిళా ఠాగూర్​.

Indian cricketers who married Bollywood actresses
మన్​సూర్​ అలీఖాన్ పటౌడీ, షర్మిళా ఠాగూర్​

ఒక్కప్పటి భారత టెస్టు క్రికెట్​ జట్టులో టైగర్​ పటౌడీ(మన్​సూర్​ అలీఖాన్​ పటౌడీ) ఓ యువ క్రికెటర్​. 1965లో దిల్లీ వేదికగా జరిగిన ఓ పార్టీలో హీరోయిన్​ షర్మిళా ఠాగూర్​, టైగర్​ పటౌడీ కలసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి, అది పెళ్లికి దారితీసింది. వీరిద్దరివి వేర్వేరు మతాలైన కారణంగా వీరి వివాహాన్ని అనేకమంది తప్పుబట్టారు. ఇలాంటి పరిస్థితుల మధ్య 1969లో వివాహబంధంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు.

2) మహ్మద్​ అజారుద్దీన్​, సంగీతా బిజ్లానీ

మహ్మద్​ అజారుద్దీన్​, సంగీతా బిజ్లానీ

టీమ్ఇండియా విజయవంతమైన కెప్టెన్లలో మహ్మద్​ అజారుద్దీన్​ ఒకరు. 1985లో జరిగిన ఓ యాడ్​ షూట్​ ద్వారా బాలీవుడ్​ హీరోయిన్​ సంగీతా బిజ్లానీని అజారుద్దీన్​ తొలిసారి కలిశాడు. అప్పుడు వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడి.. అది ప్రణయానికి దారి తీసింది. 1996లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 2010లో విడాకులు తీసుకున్నారు.

3) హర్భజన్​ సింగ్​, గీతా బస్రా

హర్భజన్​ సింగ్​, గీతా బస్రా

'ది ట్రైన్​', 'దిల్​ దియా హై' చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకుంది బాలీవుడ్​ నటి గీతా బస్రా. ఆమె నటనకు స్పిన్నర్​ హర్భజన్​ ఫిదా అయ్యాడు. 2015, అక్టోబరు 29న వీరిద్దరూ వివాహబంధం ద్వారా ఒక్కటయ్యారు.

4) యువరాజ్​ సింగ్​, హేజెల్​ కీచ్​

యువరాజ్​ సింగ్​, హేజెల్​ కీచ్​

హీరోయిన్​ కిమ్​ శర్మతో బ్రేకప్​ తర్వాత బాలీవుడ్​ హీరోయిన్​ హేజెల్​ కీచ్​తో ప్రేమలో పడ్డాడు టీమ్ఇండియా ఆల్​రౌండర్​ యువరాజ్​ సింగ్​. తొలుత యూవీ ప్రపోజల్​ను హేజెల్​ తిరస్కరించినా.. చివరికి అతడిని ప్రేమించింది. 2016 నవంబరులో వీరిద్దరూ వివాహబంధంలో అడుగుపెట్టారు.

5) జహీర్​ ఖాన్​, సాగరిక ఘాట్గే

జహీర్​ ఖాన్​, సాగరిక ఘాట్గే

ఇషా స్రవంతితో ప్రేమాయణం తర్వాత 'చక్​ దే ఇండియా' ఫేమ్​ సాగరిక ఘాట్గేతో ప్రేమలో పడ్డాడు టీమ్ఇండియా పేసర్​ జహీర్​ ఖాన్​. వీరిద్దరూ 2017లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. అప్పటినుంచి వీరిద్దరూ ముంబయిలో ఆనందంగా జీవిస్తున్నారు.

6) విరాట్​ కోహ్లీ, అనుష్క శర్మ

విరాట్​ కోహ్లీ, అనుష్క శర్మ

'రబ్​నే బనాది జోడీ' చిత్రంతో బాలీవుడ్​కు పరిచయమై.. అనేక చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన నటి అనుష్క శర్మ. 2014లో జరిగిన హెడ్​ అండ్​ షోల్డర్స్​ యాడ్​లో టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ, అనుష్క శర్మ కలిసి నటించారు. అప్పటినుంచి వీరిద్దరి మధ్య స్నేహం చిగురించి అది ప్రేమగా మారింది.

చాలా ఏళ్లు ప్రేమికులుగా ఉన్న కోహ్లీ-అనుష్క.. 2017 డిసెంబరు 11న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. వెనిస్​ వేదికగా ఇరుకుటుంబాలు, కొంతమంది సన్నిహితుల మధ్య వీరిద్దరి వివాహం జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు వీరిద్దరు తరచూ వార్తల్లో ట్రెండ్​ అవుతూ ఉన్నారు.

ఇదీ చూడండి.. ప్రియుడ్ని పెళ్లాడిన టెన్నిస్​ స్టార్​ ప్లేయర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.