ETV Bharat / sports

ధావన్​ రికార్డ్​​.. రాణించిన ఇషాన్​.. భారత్​ ఘన విజయం - ఇండియా vs శ్రీలంక లైవ్​

కొలొంబో వేదికగా లంకతో జరిగిన తొలి వన్డేలో(IND vs SL) టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సారథి శిఖర్​ ధావన్​, అరంగేట్ర ఆటగాడు ఇషాన్​ కిషన్​.. అర్ధ సెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో ధనంజయ డిసిల్వా 2, లక్షన్​ సందకన్​ ఒక వికెట్ తీసుకున్నారు.

india vs sri lanka, shikhar dhawan
ఇషాన్​ కిషన్, శిఖర్ ధావన్, ఇండియా vs శ్రీలంక
author img

By

Published : Jul 18, 2021, 10:11 PM IST

Updated : Jul 18, 2021, 10:31 PM IST

శ్రీలంక పర్యటనలో టీమ్ఇండియా శుభారంభం చేసింది. కొలొంబో ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సారథి శిఖర్​ ధావన్​, అరంగేట్ర ఆటగాడు ఇషాన్​ కిషన్​.. అర్ధ సెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో ధనంజయ డిసిల్వా 2, లక్షన్​ సందకన్​ ఒక వికెట్ తీసుకున్నారు. దీంతో మూడు వన్డేల సిరీస్​లో 1-0తో ముందంజ వేసింది పర్యటక జట్టు.

263 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్ఇండియాకు అదిరే ఆరంభం లభించింది. యువ ఓపెనర్​ పృథ్వీ షా(43; 24 బంతుల్లో) టీ20ని తలపించాడు. క్రీజులో ఉన్నంత సేపు బౌండరీల వర్షం కురిపించాడు. తొలి వికెట్​కు ధావన్​తో కలిసి కేవలం 5.3 ఓవర్లలోనే 58 పరుగులు జోడించింది ఈ జంట. ప్రమాదకరంగా మారుతున్న పృథ్వీని ధనంజయ విడగొట్టాడు.

దంచికొట్టిన ఇషాన్..

పృథ్వీని ఔట్ చేశామన్న ఆనందం లంక ఆటగాళ్లకు ఎంతో సేపు నిలువలేదు. వన్​డౌన్​గా క్రీజులోకి వచ్చిన బర్త్​డే బాయ్​ ఇషాన్​.. ఎదుర్కొన్న తొలి రెండు బంతులను సిక్స్​, ఫోర్​గా మలిచి తన ఉద్దేశాన్ని చాటాడు. ఈ క్రమంలో 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. రెండో వికెట్​కు ధావన్​తో కలిసి 85 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. ఇందులో కిషన్​వే 59 రన్స్​ కావడం విశేషం.

ధావన్​ రికార్డ్​...

మొదట్లో ఆచితూచి ఆడిన కెప్టెన్ ధావన్​(94 బంతుల్లో 86 పరుగులు).. వీరిద్దరి నిష్క్రమణ తర్వాత బ్యాట్​ ఝళిపించాడు. కెప్టెన్సీ చేపట్టిన తొలి మ్యాచ్​లోనే హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మొత్తంగా ఈ ఘనత సాధించిన ఐదో భారతీయుడిగా నిలిచాడు. దీంతో పాటు లంకపై వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్​మన్​గానూ ఫీట్​ సాధించాడు. ఇందుకు గానూ అతడు కేవలం 17 ఇన్నింగ్స్​లే తీసుకున్నాడు.

Last Updated : Jul 18, 2021, 10:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.