టీమ్ఇండియా మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాపై(ind vs aus) విజయం సాధించింది. 265 పరుగుల లక్ష్యాన్ని మరో మూడు బంతులు మిగిలుండగానే పూర్తి చేసింది(india result). అయితే ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆసీస్ జట్టు.. 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది.
వరుస విజయాలకు బ్రేక్
అయితే ఆస్ట్రేలియా వరుసగా 26 వన్డేలు గెలిచిన రికార్డుకు ఈ ఓటమితో బ్రేక్ పడింది. దీనికి కారణం టీమ్ఇండియా కావడం విశేషం.
ఈ విజయం టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ఇండియా(team india schedule 2021) మహిళలకు ఆత్మవిశ్వాసం నింపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆదివారం జరిగిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్(ind vs aus).. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా 8 కోల్పోయినప్పటికీ 49.3 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన జులాన్ గోస్వామి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.